ETV Bharat / city

జూన్‌ 8 నుంచి శ్రీవారి దర్శనం.. గంటకు 300 మందికి మాత్రమే - latest news for thirumala temple

జూన్‌ 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఐదో విడత లాక్‌డౌన్‌ ప్రకటనలో దేశవ్యాప్తంగా ఆలయాలు తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గంటకు 300 మందికే దర్శనం భాగ్యం కల్పించనున్నారు.

thirumala thirupathi Temple will be opened on June 8 in view of the corona lockdown relaxation  and dharshan for 300 members only

author img

By

Published : May 31, 2020, 7:24 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ సడలింపుల దృష్ట్యా జూన్ 8 నుంచి శ్రీవారి ఆలయాన్ని తెలవకాశముంది. రాష్ట్రంలోని ఆలయాల్లో గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అది కూడా అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే మాత్రమే. ఆలయాల్లో దర్శనాలకు అనుమతిస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై దేవాదాయ శాఖ పలు మార్గదర్శకాలను సిద్ధం చేసి వైద్యారోగ్య అనుమతి కోసం పంపింది. వైద్యారోగ్య శాఖ వీటిని ఆమోదించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.

  • దేవాదాయ శాఖ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు:

* ఆలయాల దర్శన సమయాలను స్థానిక పరిస్థితులను బట్టి కార్యనిర్వాహక అధికారులు నిర్ణయించాలి.

* భక్తులు ముందుగానే బుక్‌ చేసుకుంటే టైమ్‌ స్లాట్‌ దర్శనం కేటాయిస్తారు.

* దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడూ ఆధార్‌ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

* నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర క్రతువులకు సంబంధించి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో 30 శాతం మందినే అనుమతించాలి.

* కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు బస చేసేందుకు మాత్రమే అనుమతివ్వాలి. ఒకదాన్ని వదిలి మరొకటి చొప్పున ఉన్నవాటిలో మొత్తం 50 శాతం గదులనే భక్తులకు కేటాయించాలి.

* కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు ప్రతిసారీ జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరోటి తెరిచేందుకు అనుమతివ్వాలి.

* అన్నదానం ప్రసాదం, నిత్యాన్నప్రసాదం ఉండదు.

* ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతించవద్దు.

ఇదీ చదవండి:

అవినీతి అక్రమాలపై ముగిసిన దేవాదాయశాఖ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.