Attempted theft in Amravati: అమరావతి రాజధాని ప్రాంతంలో మళ్లీ దొంగల కలకలం నెలకొంది. తాజాగా తుళ్లూరు మండలం నెక్కల్లులో రహదారి నిర్మాణం కోసం ఉంచిన ఇనుమును దుండగులు ఎత్తుళ్లేందుకు యత్నించారు. ఇది గమనించిన రైతులు వారిని అడ్డుకుని గ్రామంలోని వారికి సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు చేరుకునే సరికి దొంగలు పారిపోయారు. విషయాన్ని గ్రామస్థులు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. రాత్రివేళల్లో మరింత నిఘా ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: