ETV Bharat / city

TSPSC Group 1: సివిల్స్​ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ... అందుకే ఇలా చేయండి..! - tspsc group 1 notification

TSPSC Group 1 Preparation Tips: టీఎస్​పీఎస్సీ నుంచి వెలువడే నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది. అందుకోసం ఏళ్ల తరబడి సన్నద్ధమవుతున్నవారు కొందరైతే.. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ప్రిపేర్​ అవుతున్న వారు మరికొందరు. అటెండర్​ నుంచి మొదలుకొని గ్రూపు 1 వరకు ఖాళీగా ఉన్న ప్రతీ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ క్రమంలో గ్రూపు 1 ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులు పక్కా ప్రణాళికతో చదవాలంటున్నారు నిపుణులు. సివిల్స్​ ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థుల నుంచి వారికి గట్టి పోటీ ఎదురుకానుందని చెబుతున్నారు.

TSPSC Group 1 Preparation Tips
తెలంగాణ గ్రూప్​1 సన్నద్ధత
author img

By

Published : Apr 8, 2022, 12:09 PM IST

TSPSC Group 1 Preparation Tips: వేల మంది నిరుద్యోగ యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూపు-1 నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనుంది. 503 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో ప్రాథమిక పరీక్షకు లక్షల మంది దరఖాస్తు చేస్తారు. వారందరికీ యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా సన్నద్ధమయ్యే అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌ ప్రిలిమినరీ పోటీకి ఏటా 50-55 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. అందులో సగం మందే పరీక్షకు హాజరవుతున్నారు. గత ఏడాది అక్టోబరు 10న జరిగిన సివిల్స్‌-2021 ప్రాథమిక పరీక్షను 22,193 మందే రాశారు. వారిలో 450-600 మంది ప్రధాన పరీక్షకు అర్హత పొంది...చివరకు 20-30 మంది ఏదో ఒక సర్వీస్‌ సాధిస్తున్నారు. ఆ పోటీలో విజయాన్ని చేజార్చుకున్న అభ్యర్థులు గ్రూపు-1 రేసులో వారికి గట్టి పోటీదారులుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వారి నుంచే ఎందుకు?: యూపీఎస్‌సీ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సివిల్స్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు ఎప్పుడో ముందుగానే ప్రకటిస్తుంది. అందువల్ల సివిల్స్‌కు పోటీపడేవారు ఎక్కువ మంది కనీసం మూడేళ్లు అహర్నిశలు పరీక్షలో విజయం సాధించేందుకు కృషి చేస్తారు. అందుకే ఐచ్ఛిక సబ్జెక్టుతో పాటు జనరల్‌ స్టడీస్‌పైనా పట్టు సాధిస్తుంటారు. ‘సివిల్స్‌, గ్రూపు-1 సిలబస్‌ కనీసం 80 శాతం ఒకటే అయినందున గ్రూపు-1 రాసే ఇతర అభ్యర్థులకు వీరు తీవ్ర పోటీ ఇస్తారు’ అని రాష్ట్ర గ్రూపు-1 అధికారుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నూతనకంటి వెంకట్‌ అభిప్రాయపడ్డారు.

అలాగని గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమయ్యే వారు భయపడాల్సిన అవసరం లేదని.. శాస్త్రీయంగా, పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావాల్సి ఉంటుందని, సిలబస్‌లోని ప్రతి పదం గురించి కనీసం ఒక పేజీ సమాచారం పాయింట్స్‌ రూపంలో తయారు చేసుకుంటూ నిరంతరం ప్రిపరేషన్‌ కొనసాగిస్తే సివిల్స్‌ అభ్యర్థులకు దీటుగా విజయం సాధించవచ్చన్నారు.

చదవడమే కాదు.. రాయడమూ సాధన చేయాలి: గ్రూప్‌-1కు సిద్ధమయ్యేవారిలో ప్రధానంగా మూడు రకాల అభ్యర్థులుంటారు. సివిల్స్‌ రాసేవారు, గ్రూపు-1 లక్ష్యం కలిగిన వారు, ఏదో ఒక ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ ప్రిపేరయ్యేవారు. సాధారణంగా సివిల్స్‌ అభ్యర్థులు చదవడంతో పాటు రాయడం బాగా సాధన చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకటే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారు కాబట్టి గ్రూపు-1 నోటిఫికేషన్‌ వచ్చే సరికే 70 శాతం సిలబస్‌ పూర్తి చేసి ఉంటారని చెప్పొచ్చు. ఈ పరీక్షలో ప్రత్యేకంగా రాష్ట్ర అంశాలు ఉన్నందున దానిపై వారు దృష్టి పెడతారు.

గ్రూపు-1 నోటిఫికేషన్లు ఎప్పుడు?ఎన్నేళ్లకు వస్తాయో తెలియని పరిస్థితి ఉన్నందున ఆ కొలువే లక్ష్యంగా ఏళ్ల తరబడి నిరంతరం సన్నద్ధం అయ్యేవారు తక్కువ అని ట్వంటీ ఫస్ట్​ సెంచరీ ఐఏఎస్​ అకాడమీ ఛైర్మన్​ కృష్ణ ప్రదీప్​ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఉన్నా వారు ఎక్కువగా చదవడంపైనే దృష్టి పెడుతూ రాయడంపై శ్రద్ధ పెట్టడం లేదని పరిశీలించినట్లు చెప్పారు. అదే పెద్ద మైనస్​ అని పేర్కొన్నారు.

"మెయిన్స్‌లో ఇచ్చిన సమయంలో వేగంగా.. తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని చెప్పడం ముఖ్యం. అది రైటింగ్‌ సాధన వల్లే వస్తుంది. అందుకే రోజుకు 9 గంటలు ప్రిపరేషన్‌ కొనసాగిస్తే అందులో 3 గంటలు రాయడానికే కేటాయించాలి. అప్పుడు సివిల్స్‌ అభ్యర్థులతో సమానంగా విజయం సాధిస్తారు. కాకపోతే టాప్‌-10లో గరిష్ఠంగా సివిల్స్‌కు సన్నద్ధమైన వారే ఉంటున్నారని గత పరీక్షల్లో విజేతలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది." -కృష్ణ ప్రదీప్‌, ఛైర్మన్‌, ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ

ఇదీ చదవండి: Yanamala Ramakrishnudu: సీఎం జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయం: యనమల రామకృష్ణుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.