ETV Bharat / city

Sand mining: ఇసుక రీచ్‌లలో.. అధికార పార్టీ నేతల కాసుల వేట - జీఎస్టీ బిల్లు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు

Sand mining: రాష్ట్రంలో ఇసుక రీచ్‌లకు భారీ గిరాకీ ఏర్పడింది. కొత్త ఉపగుత్తేదారు పేరిట కొన్ని జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాల వ్యాపారాన్ని తీసుకున్న అధికార పార్టీ నేతలు... అక్కడ మళ్లీ రీచ్‌ల వారీగా ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ముందుకొస్తే వాళ్లకు రీచ్‌లు, నిల్వ కేంద్రాలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని రీచ్‌లకు ఆది, సోమవారాల్లో బేరసారాలు సాగినట్లు తెలిసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 13, 2022, 9:49 AM IST

Updated : Sep 13, 2022, 1:19 PM IST

sand reaches in the state: రాష్ట్రంలో ఇసుక రీచ్‌లకు భారీ గిరాకీ ఏర్పడింది. కొత్త ఉపగుత్తేదారు పేరిట కొన్ని జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాల వ్యాపారాన్ని తీసుకున్న అధికార పార్టీ నేతలు... అక్కడ మళ్లీ రీచ్‌ల వారీగా ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ముందుకొస్తే వాళ్లకు రీచ్‌లు, నిల్వ కేంద్రాలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని రీచ్‌లకు ఆది, సోమవారాల్లో బేరసారాలు సాగినట్లు తెలిసింది. ఆ జిల్లాలో మొత్తం 14 రీచ్‌లు, వాటికి అనుబంధంగా నిల్వ కేంద్రాలు (స్టాక్‌ పాయింట్లు) ఉన్నాయి. ఎక్కువ ఇసుక లభించే నందలూరు ప్రాంతంలోని రీచ్‌ను అత్యధికంగా రూ.4 కోట్లకు, చాపాడు వద్ద రీచ్‌ను రూ.3 కోట్లకు, మిగిలిన రీచ్‌లను రూ.1.5 కోట్ల నుంచి రూ.1.8 కోట్ల వరకు ఇతరులకు కట్టబెట్టారని తెలిసింది. వీరంతా ఈ మొత్తాన్ని ఆ జిల్లాలో ఇసుక వ్యాపారాన్ని దక్కించుకున్న అధికార పార్టీ నేత కుటుంబీకుడికి ప్రతి నెలా ముందే చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలాగే పలు జిల్లాల్లో రీచ్‌ల వారీగా అధికార పార్టీకి చెందినవాళ్లు తీసుకునేందుకు పెద్ద ఎత్తున మంతనాలు సాగుతున్నట్లు తెలిసింది. ఒక్కో రీచ్‌ను ఎక్కువ మొత్తం చెల్లించినవాళ్లకు ఇస్తే.. వారంతా పెద్దఎత్తున అక్రమాలు చేస్తూ, ఇసుక ధరను భారీగా పెంచేస్తారనే విమర్శలు వస్తున్నాయి.

ఎవరిదీ బ్రాక్స్టన్‌ ఇన్‌ఫ్రా?

టర్న్‌కీ స్థానంలో బ్రాక్స్టన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఉప గుత్తేదారుగా ఇసుక వ్యాపారం చేపట్టనున్నట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లో ఆ కంపెనీ పేరిట ఇప్పటికే వేబిల్లులు కూడా ముద్రించారు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో ఈ సంస్థ రిజిస్టర్డ్‌ చిరునామా.. డోర్‌ నంబరు 50-116-20/1, ఎంఐజీ 112, ఎన్‌ఈ లేఅవుట్‌, క్యాన్సర్‌ ఆసుపత్రి సమీపంలో, సీతమ్మధార, విశాఖపట్నంగా ఉంది. 2009లో ఇది ఏర్పాటైంది. డైరెక్టర్లుగా వెంకట పవన్‌కుమార్‌ వట్టి, రామరాజు బుద్ధరాజు ఉన్నారు. సంస్థ అధీకృత మూలధనం రూ.1.50 కోట్లుగా చూపారు. ఈ కంపెనీ గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున పోటీచేసి ఓడిపోయి, ప్రస్తుతం ప్రభుత్వానికి దగ్గరగా వ్యవహరిస్తున్న వ్యాపారికి చెందినదిగా తెలిసింది.

* రాష్ట్రంలో ఇసుక వ్యాపారం చేసే ఉపగుత్తేదారు సంస్థ టర్న్‌కీ శనివారం నుంచి వైదొలగింది. దీంతో దాదాపు అన్నిచోట్లా ఇసుక విక్రయాలు ఆగిపోయాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఇసుక కొరత ఏర్పడుతోంది. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్దఎత్తున ఇసుక విక్రయాలు జరుగుతాయి. వందలాది లారీల ఇసుక అమ్ముడవుతుంటుంది. మూడు రోజులుగా ఇసుక లేకపోవడంతో లారీలకు గిరాకీ లేకుండా పోయింది.

జీఎస్టీ నంబరు లేకుండా విక్రయాలు

రాజమహేంద్రవరంలోని పడవ ర్యాంపులు, ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం జ్యోతి నిల్వ కేంద్రంలో సోమవారం ఇసుక విక్రయించారు. ఇందులో ఒక్కోచోట ఒక్కో రకమైన వేబిల్లులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలోని ఓ పడవ ర్యాంపులో జేపీ-టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట ఉన్న వేబిల్లు ఇచ్చారు. టర్న్‌కీ శనివారం నుంచి ఇసుక వ్యాపారం నుంచి వైదొలగినా దాని పేరు, జీఎస్టీ నంబరుతోనే బిల్లులు జారీ చేయడం గమనార్హం. మరో పడవ ర్యాంపులో ప్రధాన గుత్తేదారు జేపీ సంస్థ పేరు ఉంది. దీనిపై జీఎస్టీ నంబరు లేదు. సిద్ధవటం వద్ద జ్యోతి నిల్వ కేంద్రంలో ఇచ్చిన వేబిల్లులో జేపీ-బ్రాక్స్టన్‌ ఇన్‌ఫ్రా పేరు ఉంది. ఈ బిల్లుపైనా జీఎస్టీ నంబరు లేదు. ఇలా జీఎస్టీ నంబరు లేకుండా ఇసుక విక్రయాలు చేయడం తీవ్రమైన ఉల్లంఘన కిందకు వస్తుంది. అసలు ఇంకా జేపీ సంస్థతో బ్రాక్స్టన్‌ ఇన్‌ఫ్రా ఉపగుత్తేదారుగా ఒప్పందం చేసుకోకుండానే.. దానిపేరిట బిల్లులు ఎలా సిద్ధం చేశారనేదీ ప్రశ్నార్థకం అవుతోంది.

ఇసుక రీచ్‌ల అక్రమాలు

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.