ETV Bharat / city

Jagananna Layouts: అమరావతిలో జగనన్న లేఔట్లు ఇక లేనట్లే..! - రాజధానిలో జగనన్న లేఔట్‌

Jagannath Layouts: వారంతా నిరుపేదలు.. రెక్కాడితే కానీ డొక్కాడని దినసరి కూలీలు.. ఇంట్లో పనిచేసే మహిళలు.. వారికి గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు జక్కంపూడిలో మంజూరు చేశారు.. చాలా మంది లబ్ధిదారుల వాటా చెల్లించారు.. దాదాపు 6వేల మంది వరకు ఉన్నారు.. వీరికి టిడ్కో ఇళ్లు రద్దు చేశారు.. ఎందుకో తెలుసా...

Jagannath Layouts
జగనన్న లేఔట్లు
author img

By

Published : Mar 4, 2022, 11:06 AM IST

Jagananna Layouts: గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లకు కొత్త ప్రభుత్వం చరమగీతం పాడిన విషయం తెలిసిందే. 25 శాతం పైన నిర్మాణం అయిన వాటిని మాత్రమే పూర్తి చేసి అప్పగించాలని నిర్ణయించింది. పట్టణ పేదలకు సెంటు స్థలం, గ్రామీణ పేదలకు సెంటున్నర చొప్పున జగనన్న కాలనీలలో నివేశన స్థలాలు పంపిణీ చేశారు.

పలుచోట్ల భారీ లేఔట్‌...

నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైకాపా ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడలోని నిరుపేదలకు పలుచోట్ల భారీ లేఔట్‌ వేశారు. దాదాపు 90వేల మంది అర్హులను గుర్తించారు. వీరిలో 27వేల వరకు టిడ్కో ఇళ్లు మినహా మిగిలిన వారికి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొండపావులూరు, నున్న, కొత్తూరు తాడేపల్లి, ముత్యాలంపాడు, ఇబ్రహీంపట్నం, కండపల్లి తదితర ప్రాంతాల్లో భారీ లేఔట్‌లు వేశారు. దాదాపు 30వేల మందికి నివేశన స్థలాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి రాజధాని గ్రామాల్లో ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. మందడం గ్రామంలో విజయవాడ నిరుపేదలకు దాదాపు 10వేల మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

లేఔట్‌ వేసే అవకాశం లేదు...

Jagannath Layouts: తూర్పు నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాల వారు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల వారు ఉన్నారు. అమరావతి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లేఔట్‌ ఆగిపోయింది. ఆ పేదలకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు. టిడ్కో ఇళ్లు లేవు. ప్రస్తుతం అమరావతిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఇక రాజధాని గ్రామాల్లో జగనన్న లేఔట్‌ వేసే అవకాశం లేదని తేలిపోయింది. ఇతర అవసరాలకు కేటాయించవద్దని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీంతో 10వేల మంది పేదలకు ఎక్కడ ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక్కొక్కరికి సెంటు చొప్పున 100 ఎకరాలు స్థలం కావాలి. దీనికి రహదారులు అన్నీ కలిపితే కనీసం 200 ఎకరాలకు పైగా ఉండాలి. అంత స్థలం సేకరణ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనుంది.

ఇదీ చదవండి:

బీజం నుంచి తీర్పు వరకు... రాజధాని అంశంలో కీలక ఘట్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.