ETV Bharat / city

సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం - discussions on cps

govt of ap
govt of ap
author img

By

Published : Aug 17, 2022, 6:42 PM IST

Updated : Aug 17, 2022, 7:45 PM IST

18:40 August 17

Discussions on CPS గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలు

CPS Issue: సెప్టెంబర్ 1న సీఎం నివాసాన్ని.. ముట్టడిస్తామని CPS ఉద్యోగ సంఘాలు ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలతోపాటు సీపీఎస్​కు చెందిన ఉద్యోగ సంఘాలనూ ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు సచివాలయంలో సంప్రదింపుల కమీటితో సమావేశానికి రావాల్సిందిగా కబురు పంపింది. సచివాలయం రెండో బ్లాక్​లోని..ఆర్థిక శాఖ కార్యాలయంలో సమావేశం జరగనుంది.

సీపీఎస్​పై ఉద్యోగ సంఘాలు: 2004 సెప్టెంబర్‌ 1 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలోని ఉద్యోగులకు నూతన పింఛను విధానం (సీపీఎస్) అమలు చేస్తోందని.. ఈ విధానం వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత న్యాయంగా, చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, కమ్యుటేషన్ దక్కట్లేదని ఏపీసీపీఎస్ యూఎస్ నేతలు సి.యం.దాస్, రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక, సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు. ఈ విధానం వల్ల ఒక్కో ఉద్యోగికి కోటి నుంచి కోటిన్నర రూపాయలు వస్తాయని మభ్యపెట్టారని, కానీ.. వాస్తవంలో ఒక్కో రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగికి రూ.650 నుంచి 1005 రూపాయలు పెన్షన్​గా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుడు ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని అనేక బహిరంగ సభలలో, మీడియా ఎదుట హామీ ఇచ్చారని చెప్పారు. జగన్ మాటలు నమ్మి‌న ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించారని, కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ ను రద్దు చేయకుండా.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సీపీఎస్ విధానం రద్దు చేయకుండా.. గ్యారంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) పేరుతో కొత్త విధానాన్ని తీసుకువస్తామని చెప్పడం ఉద్యోగులను మోసగించడమేనని అన్నారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రలలో సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేస్తుంటే.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ చర్యలకు వ్యతిరేకంగా.. సెప్టెంబర్1న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 17, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.