ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పీఆర్సీ విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని.. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ఆరోపించారు. తాము కోరిన 17 డిమాండ్లను ఇంతవరకు పరిష్కరించలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే... రోడ్డుపైకి వచ్చి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: