రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నెలలో 100 రెట్లకుపైగా పెరిగాయి. మార్చి 25 నాటికి 10 కరోనా కేసులుండగా, ఏప్రిల్ 25 నాటికి ఆ సంఖ్య 1016కి పెరిగింది. ఇదే సమయంలో దేశంలోని మొత్తం కేసుల్లో మన రాష్ట్రంలో నమోదైన కేసుల శాతమూ పెరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ covid19india.orgలో వెల్లడించిన వివరాల ప్రకారం... మార్చి 25 నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 657. వాటిలో మన రాష్ట్రంలోనివి 1.52 శాతం. ఏప్రిల్ 25 నాటికి దేశంలో నమోదైన కేసులు 25,313. వాటిలో మన రాష్ట్రంలోనివి 4.01 శాతం
ప్రతి 10 రోజులకూ పెరుగుతున్న తీరు ఇలా
తేదీ | కేసుల సంఖ్య | పెరుగుదల |
మార్చి 15 | 1 | -- |
మార్చి 24 | 8 | 7 |
ఏప్రిల్ 3 | 164 | 156 |
ఏప్రిల్ 13 | 439 | 275 |
ఏప్రిల్ 23 | 893 | 454 |
ఏప్రిల్ 25 | 1,016 | 123 |
ఇదీ చదవండి