రాష్ట్రంలో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను 151 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించనున్నారు. ఈసారి 61,892 మంది పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పరీక్ష జరగనుంది. కొవిడ్ దృష్ట్యా ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది రాష్ట్రంలో 98 కేంద్రాల్లో నిర్వహించగా.. ఈ సారి 151కి పెంచారు. 2019లో 57,755 మంది పరీక్ష రాయగా ఈ సారి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది.
- ‘నీట్’ భయంతో తమిళనాడు విద్యార్థిని ఆత్మహత్య
నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని మదురై జిల్లా తల్లాకులంకు చెందిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ కుమార్తె జ్యోతిశ్రీ దుర్గ గతేడాది నీట్ రాసినా వైద్య సీటు రాలేదు. మళ్లీ పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకుంది. బలవన్మరణానికి ముందు ఆమె రాసిన ఓ లేఖను, సెల్‌ఫోన్‌లోని ఆడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీట్‌లో మరోసారి విఫలమవుతానన్న భయంతోనే ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. ఇటీవల అరియలూరు జిల్లాలో ఓ విద్యార్థి కూడా నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: కృష్ణా- గోదావరి బేసిన్లో భారీగా మీథేన్!