ETV Bharat / state

'అందుకే ఫైలుపై సంతకం పెట్టా' - కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్ - ACB ENQUIRY ON KTR FORMULA E RACE

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ అధికారులకు కీలక విషయాలను వెల్లడించిన కేటీఆర్​ - సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు

Former Minister KTR Attend ACB Enquiry in Formula E Car Racing Case
Former Minister KTR Attend ACB Enquiry in Formula E Car Racing Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Former Minister KTR Attend ACB Enquiry in Formula E Car Racing Case : ఫార్ములా ఈ రేసు నిర్వహణకు తన ఆదేశాలతోనే నిధులు మంజూరు చేశారని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నామని తెలిపారు. సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు. ఫార్మూలా ఈ రేసు కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్​ను సుమారు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. నిందితులను వరుసగా విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6నే విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంగా అర్ధాంతరంగా వెనుతిరిగారు. అదేరోజు అధికారులు మరోసారి నోటీసులివ్వడంతో గురువారం ఉదయం 10 గంటలకు కేటీఆర్‌ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న మాజిద్‌ సెలవులో ఉండటంతో డీఎస్పీ మధుసూదన్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్​లు విచారించారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు రూ.55 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించారని, అలాగే విదేశీ సంస్థకు చెల్లింపు జరిపే ముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని అభియోగాలపై మాజీ మంత్రి కేటీఆర్​ను విచారించారు.

కేటీఆర్​ క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు - సుప్రీంకోర్టులో సవాల్

కేటీఆర్ విచారణ మొత్తం ఎఫ్​ఈఓకు నిధుల చెల్లింపుపైనే జరిగినట్లు తెలుస్తోంది. రెండోసారి ఫార్ములా ఈ రేసు నిర్వహణకు స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుందని చెప్పినట్లు సమాచారం. అయితే కొత్త స్పాన్సర్‌ను వెతికే సమయం లేకపోవడంతో HMDA నుంచి నిధులు మంజూరు చేశామని కేటీఆర్ తెలిపారు. ఇదంతా తన ఆదేశాల ప్రకారమే జరిగిందని వివరించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు, అవినీతి లేదన్నారు. అయితే మంత్రిమండలి ఆమోదం ఎందుకు తీసుకోలేదని అధికారులు ప్రశ్నించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలేనని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం.

ఫార్ములా ఈ రేసు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏయే మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందని కూడా అధికారులు ప్రశ్నించారు. ఆ సమాచారమంతా ప్రభుత్వం వద్దనే ఉంటుందని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా రేస్ నుంచి తప్పుకున్న ఏస్ నెక్ట్స్‌ జెన్ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులు ప్రశ్నించారు. ఆలోపే ఎన్నికలు వచ్చాయని, అనంతరం ప్రభుత్వం మారడంతో తమ చేతుల్లో లేకుండా పోయిందని కేటీఆర్ వెల్లడించినట్లు సమాచారం. ఇదే కేసులో అరవింద్‌ కుమార్​ను సైతం ప్రశ్నించిన ఏసీబీ అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఫార్ములా ఈ కారు రేసింగ్‌ కేసులో రంగంలోకి ఈడీ - వివరాలివ్వాలని ఏసీబీకి లేఖ

రేసును హైదరాబాద్‌లో నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఫైలు పైన సంతకం పెట్టినట్లు కేటీఆర్ ఏసీబీకి తెలిపారు. ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా - ఈ కి చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అధికారుల ఎదుట కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. మొదటి ఈ- రేసు సందర్భంగా అర్బన్ ఏస్ సంస్థ పూర్తిగా ఫార్ములా-ఈతోనే కార్యకలాపాలు నిర్వహించిందని గుర్తుచేశారు. కేవలం మౌలిక వసతులను మాత్రమే ప్రభుత్వం కల్పించిందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మరిన్ని విషయాలు తెలుసుకుంనేందుకు మరోసారి కేటీర్​కు నోటీసులు ఇచ్చి విచారించాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ఈ రేసు కేసులో అప్పటి హెచ్​ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్​ఎన్​ రెడ్డి ఈరోజు ఏసీబీ ముందు హాజరు కానున్నారు. అరవింద్‌ కుమార్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే బీఎల్​ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది.

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​పై ఏసీబీ విచారణ? - ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.