ETV Bharat / city

తెలంగాణ: మాజీ ఎమ్మెల్యేల మృతికి నేడు శాసనసభ సంతాపం - Assembly today mourned the death of formers MLA

తెలంగాణలోని మాజీ ఎమ్మెల్యేల మృతికి శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం కానుంది. ఈరోజు కేవలం సంతాపాలకు మాత్రమే సభ పరిమితం కానుంది.

Telangana Assembly sessions
తెలంగాణ: మాజీ ఎమ్మెల్యేల మృతికి నేడు శాసనసభ సంతాపం
author img

By

Published : Mar 16, 2021, 1:07 PM IST

దివంగత నేత నోముల నర్సింహయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యేల మృతికి శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించనుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం కానుంది. నేడు కేవలం సంతాపాలకు మాత్రమే సభ పరిమితం కానుంది.

ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్యకు సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, సభ్యులు సంతాప తీర్మానంపై మాట్లాడతారు. ఇటీవల మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా సభ సంతాపం తెలపనుంది.

మాజీ శాసనసభ్యులు నాయిని నర్సింహారెడ్డి, కమతం రామిరెడ్డి, కటికనేని మధుసూదనరావు, కట్టా వెంకటనర్సయ్య, దుగ్యాల శ్రీనివాసరావు, చెంగల్ బాగన్న, కె.వీరారెడ్డిల మృతి పట్ల సంతాపం తెలుపుతూ సభాపతి తీర్మానం ప్రతిపాదించనున్నారు.

ఇవీచూడండి:

14వ ఆర్థిక సంఘం నిధులన్నీ ఖర్చు చేయండి: పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.