ETV Bharat / city

ramky: రూ.1,200 కోట్లకు పన్ను ఎగ్గొట్టిన రాంకీ సంస్థ - వైకాపా ఎంపీ ఆళ్ల అయోధ్య రెడ్డి

రాంకీ కార్యాలయాల్లో(ramky) ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టినట్లు తేలింది. హైదరాబాద్​లోని రాంకీ సంస్థలో ఈ నెల 6న సోదాలు చేసి రూ. 1,200 కోట్లకు పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీశాఖ (it raids) అధికారులు గుర్తించారు. ఎగవేత సొమ్మును చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించినట్లు తెలిపారు.

it
it
author img

By

Published : Jul 9, 2021, 7:09 PM IST

హైదరాబాద్‌లో ఈ నెల 6న రాంకీ సంస్థలో (ramky) నిర్వహించిన తనీఖీల్లో భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ (it raids) ప్రకటన విడుదల చేసింది. స్థిరాస్తి, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ రంగంలో ఉన్న ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరపగా.. అక్రమ లావాదేవీలకు సంబంధించిన భారీ ఎత్తున పత్రాలు, షీట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కోట్లలో అక్రమ లావాదేవీలు..

2018-19 ఏడాదిలో ఈ సంస్థ సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజారిటీ వాటాను అమ్మి భారీగా మూలధనాన్ని ఆర్జించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. అమ్మకాలకు సంబంధించిన పత్రాలు, లాభాలను దాచిపెట్టి నష్టాలుగా చూపెట్టినట్లు వివరించారు. దాదాపు 12 వందల కోట్ల రూపాయలకు సంబంధించిన మదింపుదారుల పన్నును ఎగ్గొట్టినట్లు ఐటీ పేర్కొంది. లాభాలను దాచిపెట్టి 288 కోట్ల రూపాయలను నష్టాలుగా చూపెట్టారని, వాటికి సంబంధించిన లెక్కల్లోకి రాని లావాదేవీలను గుర్తించామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

పన్ను చెల్లింపునకు అంగీకారం..

కాగా లెక్కల్లోకి చూపని 300 కోట్ల రూపాయలతో పాటు, ఎగవేతకు పాల్పడిన పన్నును చెల్లించేందుకు సంస్థ అంగీకరించినట్లు ఐటీ శాఖ వెల్లడించగా.. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈనెల 6న హైదరాబాద్​ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిపారు. సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఎకకాలంలో సోదారు నిర్వహించారు.

ఇదీ చూడండి: JAGAN PLAYED CRICKET: సీఎం జగన్​ బ్యాటింగ్​..ఎంపీ అవినాష్​ బౌలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.