ఎస్‌ఈసీ ‘ఆర్డినెన్స్’పై నేడు హైకోర్టు తీర్పు - రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వార్తలు
రాష్ట్రం మెుత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) వ్యవహారంపై తీర్పును నేడు హైకోర్టు వెల్లడించనుంది.
ఎస్‌ఈసీ వ్యవహారంలో నేడే తీర్పు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నియామకం, పదవీకాలం విషయమై పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనంతర జీవోలపై దాఖలైన వ్యాజ్యాల్లో నేడు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. తనను తొలగించాలన్న దురుద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారని దానిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో మొత్తం 13 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఇవీ చదవండి: 'లాక్డౌన్ ఉల్లంఘనలపై వారికి ఫిర్యాదు చెయ్యండి'
Last Updated : May 29, 2020, 10:12 AM IST