అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన ఇల్లు తొలగించడంపై హైకోర్టు యథాస్థితి కొనసాగించింది. తమ ఇంటిని అధికారులు తొలగిస్తున్నారని నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు సహకారంతో అనంతలక్ష్మి దంపతులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది యలమంజుల బాలాజీ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించింది. హైకోర్టు స్టేటస్ కో విధించింది. తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు పిటిషనర్లు విషం తాగి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ భూమిపై తొందరపాటు చర్యలొద్దు: మచిలీపట్నం శివార్లలో 1973లో 112 ఎకరాలు దళితులకు ఇచ్చిన భూమిని స్వాధీన పరచుకోవడంపై కర్ర అగ్రహారనికి చెందిన చిరివెళ్ల మంగమ్మ... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు 60 సంవత్సరాల క్రితం ఇచ్చిన భూములు ఈ రోజు అన్యాయంగా లాక్కోవడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆక్షేపించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుపేదల భూములు లాక్కుంటున్నారంటూ వాదనలు వినిపించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ భూమిని ఎవరికీ బదలాయించ వద్దని, ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని న్యాయస్థానం స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. తదుపరి విచారణను విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: