ETV Bharat / city

' "రహస్య" జీవోలంటూ వెబ్​సైట్​లో ఉంచకపోవటం సరికాదు' - హైకోర్టు వార్తలు

ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్ సైట్లో ఉండకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది.వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందుబాటులో లేదందున విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

High Court
High Court
author img

By

Published : Sep 9, 2021, 4:00 AM IST

ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్ సైట్లో ఉండకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మూడు ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందుబాటులో లేదందున విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

జీవోలను వెబ్ సైట్లో ఉంచడకపోవడాన్ని సవాలు చేస్తూ .. జీఎంఎన్‌ఎస్ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఆంజనేయులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 7న ప్రభుత్వం తాజాగా జీవో జారీచేస్తూ.. గతంలో పేర్కొన వెబ్ సైట్ స్థానంలో ఏపీ ఈ గెజిట్ వెబ్ సైట్లో జీవోలను ఉంచేందుకు నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అత్యంత గోప్యం, గోప్యం, రహస్యం అని కేటగిరి చేసిందన్నారు. అలాంటి జీవోలను వెబ్ సైట్లో పెట్టబోమని పేర్కొందన్నారు. ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా విభజించారో స్పష్టత లేదన్నారు.

ఇదీ చదవండి

Suspended: రూ.100 కోట్ల భూవ్యవహారం... తహసీల్దార్‌ సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.