ETV Bharat / city

HIGH COURT: పీజీ వైద్య విద్య రుసుములు తాజాగా నిర్ణయించండి - పీజీ వైద్య విద్య రుసుములపై హైకోర్టు తాజా ఆదేశాలు

ప్రైవేటు కళాశాలల్లో పీజీ వైద్య విద్య రుసుములను ఖరారు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 15న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 42ను హైకోర్టు రద్దు చేసింది. జీవో 42 ప్రకారం రుసుములను ఖరారు చేసిన వైద్య విద్య సంస్థలన్నింటి విషయంలో నాలుగు వారాల్లో తాజా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత విద్య కమిషన్​ను ఆదేశించింది. ఉన్నత విద్య కమిషన్ నుంచి సిఫారసు ఉత్తర్వులు అందిన వారంలో ఫీజులను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

HIGH COURT
HIGH COURT
author img

By

Published : Oct 13, 2021, 3:37 AM IST

ప్రైవేటు కళాశాలల్లో పీజీ వైద్య విద్య రుసుములను 2017-18 నుంచి 2019-2020 విద్యా సంవత్సరాలకు ఖరారు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 15న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 42ను హైకోర్టు రద్దు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజులను సిఫారసు చేస్తూ ' ఏపీ ఉన్నత విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్ ' పంపిన సమాచార ఉత్తర్వులను రద్దు చేసింది. జీవో 42 ప్రకారం రుసుములను ఖరారు చేసిన వైద్య విద్య సంస్థలన్నింటి విషయంలో నాలుగు వారాల్లో తాజా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత విద్య కమిషన్​ను ఆదేశించింది. ఆయా వైద్య విద్యా సంస్థల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. ఫీజుల విషయంలో ఉత్తర్వులు జారీచేయాలని తేల్చిచెప్పింది.

రుసుముల సిఫారసుకు కారణాలు పేర్కొంటూ , ప్రతి విద్యా సంస్థ విషయంలో ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ఉన్నత విద్య కమిషన్ నుంచి సిఫారసు ఉత్తర్వులు అందిన వారంలో ఫీజులను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుసుముల విషయంలో ప్రతీ వైద్య విద్య కళాశాలలకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేయాలంటూ గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్నత విద్య కమిషన్ వ్యవహరించలేదని ఆక్షేపించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు . 2017-18 నుంచి 2019-2020 విద్యా సంవత్సరాల పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 42 ను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఇదే వ్యవహారంపై గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఉన్నత విద్య కమిషన్ ఉత్తర్వులు జారీచేయలేదని తెలిపాయి.

ఇదీ చదవండి

HC: విద్యార్థుల విషయంలో జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.