సీపీఎస్ రద్దు విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ఏపీ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఇటీవలే సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశాలపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని... చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ను కలిసినపుడు ఆయన సమస్యపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. గుంటూరులో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికల నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమానికి దిగుతామని ఏపీజేఏసీ జనరల్ సెక్రెటరీ జోసెఫ్ సుధీర్ బాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ