ETV Bharat / city

ప్రేమ పెళ్లి: అమ్మాయి కుటుంబ సభ్యుల దాడిలో అబ్బాయి తండ్రి మృతి

కొడుకు ప్రేమ పెళ్లితో తండ్రి ప్రాణాలు పోయిన విషాదకర ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా స్తంభంపల్లిలో జరిగింది. అమ్మాయి కుటుంబ సభ్యులు చేసిన దాడిలో కళ్లు లేని ఆ తండ్రి ప్రాణాలు విడిచాడు. అంధుడనే కనికరం లేకుండా దుర్మార్గంగా కొట్టి చంపారు. దీంతో గ్రామంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.

person dead in attack
అమ్మాయి బంధువుల దాడిలో మరణించిన లక్ష్మీనారాయణ
author img

By

Published : Oct 30, 2020, 10:55 PM IST

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ప్రేమ వ్యవహారం అబ్బాయి తండ్రి ప్రాణాలు తీసింది. స్తంభంపల్లికి చెందిన తునికి మహేశ్​ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. వీరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయి కుటుంబ సభ్యులు.. ఈనెల 27న అబ్బాయి​ తండ్రి లక్ష్మీనారాయణపై దాడి చేశారు.

కళ్లు లేని లక్ష్మీనారాయణను విచక్షణరహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని.. కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీనారాయణ మృతి చెందాడు. దివ్యాంగుడు అయినప్పటికీ మానవత్వాన్ని మరిచి విపతరీంగా కొట్టడం వల్లే తన భర్త మృతి చెందాడని.. భార్య విజయ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 మంది వచ్చి దాడి చేశారని.. అందరినీ గుర్తుపట్టలేకపోతున్నట్లు చెప్పారు.

పోస్ట్​మార్టం నిమిత్తం లక్ష్మీనారాయణ మృతదేహాన్ని కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీనారాయణ మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వల్ల గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి: భార్యను హతమార్చిన భర్త.. పరారీలో నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.