ETV Bharat / city

విద్యుత్ కొనుగోళ్లు చేయొచ్చు,తెలంగాణకు కేంద్రం అనుమతి - విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన కేంద్రం

గత రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇంధన ఎక్స్ఛేంజీ విద్యుత్తు కొనుగోలుకు అనుమతులను పునరుద్దరించింది.

power
power
author img

By

Published : Aug 21, 2022, 9:48 AM IST

విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రం వెల్లడించింది. రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. తొలుత తెలంగాణ డిస్కంలు రూ.1360 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ విద్యుత్తు కొనుగోలు చేయకుండా అడ్డుకుంది. ఆ తరువాత ఈ బకాయిలు రూ.52.85 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ నిషేధాన్ని కొనసాగించింది. చెల్లించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల బకాయిలపై గందరగోళం నెలకొంది.

శనివారం చెల్లించాల్సిన పాత బకాయిలు ఏమీ లేవని తెలిపింది. ఈ మేరకు ఐఈఎక్స్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని తెలంగాణతో పాటు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తెలంగాణ డిస్కంలు ఐఈఎక్స్‌ నుంచి 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్‌ శనివారం 11,524 మెగావాట్లకు తగ్గింది. కేంద్ర నిషేధంతో పాటు విద్యుత్తు లోటుతో రెండు రోజులు ఇబ్బందులు వస్తాయని భావించినా, డిమాండ్‌ తగ్గడంతో పాటు కేంద్రం అనుమతించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.