ETV Bharat / city

ఆవిరైనా 'కారు' ఆశలు షోరూంలోనే.. - Car accident at tata showroom

ఓ కస్టమర్ కారు కొందామని షోరూమ్​కు వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బంది కారును చూపించి అందుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఫస్ట్ ఫ్లోర్​లో ఉన్న కారును తీసుకోవాల్సిందిగా కస్టమర్​కు యాజమాన్యం సూచించింది. అక్కడి వెళ్లి కారును స్టార్ట్ చేయగానే ఆగకుండా వెళ్లి కింద ఉన్న మరో కారుపై పడింది.

Accident
కారు ప్రమాదం
author img

By

Published : Jul 19, 2021, 10:05 PM IST

షోరూంలోనుంచి దూసుకొచ్చిన కారు

హైదరాబాద్​ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపురి కూడలి వద్ద టాటా మోటర్ షోరూమ్​లో ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొనుగోలుదారుడికి, బాలుడికి స్వల్పగాయాలయ్యాయి. టాటా మోటార్స్ కార్ షోరూమ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కారు కొనడానికి వచ్చిన కస్టమర్​కి షో రూమ్​లోని మొదట అంతస్తులో ఉన్న కారును ఇచ్చింది. కస్టమర్ కారును స్టార్ట్ చేశాక నియంత్రణ కోల్పోయి మొదటి అంతస్తు లిఫ్ట్​పై నుంచి కింద ఉన్న మరో కారుపై పడిపోయింది. కారులో ఉన్న కస్టమర్​కు మరో బాబు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో అల్కాపురి కూడలిలో కొద్దిసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి: పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.