ETV Bharat / city

దేశంలోనే అత్యున్నత ఐఐఎస్​సీలో సీటు సంపాదించిన తెలంగాణ యువకుడు

పాఠశాల దశలోనే విద్యార్థులు భవిష్యత్తు గురించి అనేక లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ఉంటారు. ఉన్నత విద్య పూర్తి చేసి అభిరుచికి అనుగుణంగా అడుగులు వేసే క్రమంలోనే అసలైన సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రతిభ ఉన్నా సరైన ప్రణాళిక లేక... ఆసక్తి ఉన్నా అవగాహన లేక లక్ష్యానికి దూరమవుతుంటారు. అయితే అభిరుచికి తోడు అవగాహన, శ్రమించే తత్వం ఉంటే... ఎలాంటి విజయమైనా సొంతం చేసుకోవచ్చునని నిరూపించాడు... తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ యువకుడు ప్రదీప్. పట్టుదలతో ప్రతిష్ఠ్మాతక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(Indian Institute of Science) బెంగళూరులో సీటు సాధించాడు.

pradeep
pradeep
author img

By

Published : Jun 27, 2021, 4:03 PM IST

ఐఐఎస్​సీలో సీటు సంపాదించిన తెలంగాణ యువకుడు ప్రదీప్​

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్...! పరిశోధనల విభాగంలో భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం. బెంగళూరు కేంద్రంగా పరిశోధన అంశాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థలో పీహెచ్‌డీ చేయటం అనేదే ఒక గౌరవంగా భావిస్తుంటారు విద్యార్థులు. ఆ అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కానీ అత్యుత్తమ ప్రతిభ చూపిన అతికొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతోంది. అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు...తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్‌కు చెందిన యువకుడు ప్రదీప్‌.

జిల్లాలోనే..

ఆ‌ర్మూర్‌కు చెందిన దోండి రవీందర్, రాజేశ్వరి దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి ఇద్దరు కుమారులు.. ప్రణయ్, ప్రదీప్. ఉన్నత విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే పూర్తి చేసిన ప్రదీప్... పదో తరగతిలో 9.5 జీపీఏ సాధించాడు. ఇంటర్​లో ఎంపీసీ గ్రూప్​లో చేరి 946 మార్కులు తెచ్చుకున్నాడు. ఉత్తర ప్రదేశ్​లోని రాయబరేలిలో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

ఐఐఎస్​సీలో అవకాశం

2019లో గేట్‌ పరీక్ష రాసి 2048 ర్యాంకు తెచ్చుకుని ఉత్తరాఖండ్ రూర్కీ ఐఐటీ నుంచి ఇటీవల ఎంటెక్ పట్టా ప్రదీప్‌ అందుకున్నాడు. పీహెచ్‌డీలో ప్రవేశం కోసం 2020లో గేట్ పరీక్ష రాయగా జాతీయ స్థాయిలో 610 ర్యాంకు వచ్చింది. 130 మందిని పీహెచ్‌డీ ప్రవేశాల కోసం మౌఖిక పరీక్షలకు పిలిస్తే.. కేవలం ఏడుగురు మాత్రమే ఎంపికయ్యారు. అందులో ప్రదీప్ రెండో స్థానంలో నిలిచి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో సీటు దక్కించుకున్నాడు.

అవమానంగా భావించి..

ఉత్తమ విద్యార్థిగా అందరి మన్ననలందుకుంటున్న ప్రదీప్‌.. పాఠశాల దశలో అంత చురుకైన విద్యార్థి కాదు. పాఠశాలలో బాగా చదివే వారిని ఒక సెక్షన్, చదవని వారిని మరో సెక్షన్ చేయడం... చదవని వారి సెక్షన్​లో తనను చేర్చడం అవమానంగా భావించాడు. దీంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. అప్పటికే ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్న అన్న ప్రణయ్ స్ఫూర్తితో పట్టుదలతో చదివాడు. చక్కని ప్రతిభ చూపుతూ ఎంటెక్ పూర్తి చేశాడు.

తల్లిదండ్రుల సంతోషం

తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు కావటంతో చదువు విలువ తెలిసిన వీరు ప్రదీప్‌, ప్రణయ్‌ను పాఠశాల దశ నుంచే అన్నివిధాల ప్రోత్సాహించారు. వారి ఆశలకు అనుగుణంగా ప్రదీప్‌ పీహెచ్‌డీ వైపు అడుగులు వేయగా, పెద్దబ్బాయి ప్రణయ్‌ ఐఐటీ బాంబే నుంచి డిగ్రీ అందుకుని... శాంసంగ్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలిద్దరూ మంచి స్థాయికి చేరుకోవటం వల్ల తాము పడిన శ్రమ మరిచిపోయామని రవీందర్, రాజేశ్వరి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పీహెచ్‌డీ పూర్తి చేశాక ప్రభుత్వ పరిశోధన కేంద్రాల్లో ఉద్యోగాలు, ఐఐటీల్లో అధ్యాపకుడిగా అవకాశాలు ఉంటాయంటున్న ప్రదీప్... అధ్యాపకుడిగా యువతకు ఉత్తమ భవిష్యత్‌ అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

ఇదీ చూడండి: సేవకు అడ్డురాని పేదరికం.. ఈ యువనేస్తాల మనసు బంగారం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.