ఆదివారం 250వ రోజు అమరావతి ఉద్యమం సందర్భంగా.... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు దీక్షలు చేపట్టాలని...అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. ప్రతి ఒక్క ఇంటిలోనూ.... పోరాటానికి స్ఫూర్తిగా ఒక చెట్టు నాటాలని సూచించారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా దీక్షలు చేపట్టనున్నట్లు.... చెప్పారు. అమరావతి విషయంలో మాట తప్పితే రాజకీయ సన్యాసం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు.... ఇప్పుడు ఎక్కడున్నారని ఐకాస ప్రశ్నించింది.
అమరావతి విషయంలో ఇచ్చిన హామీలను అధికార పార్టీ నాయకులు విస్మరించారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించి అమరావతిని కాపాడాలని కోరారు. తమ రైతులకు కౌలు ఆలస్యం చేస్తున్నారని ... పండుగలు కూడా చేసుకోలేని స్థితిలోకి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను నెట్టేశారన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాంటిదో ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి అలాంటిదన్నారు. రాయలసీమ ప్రజలు విశాఖ వెళ్లాలంటే సరైన రోడ్డు కూడా లేదని అభిప్రాయపడ్డారు. భూములు ఇచ్చిన రైతులను అన్యాయం చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలు మీడియాలో మాత్రమే పోరాటం చేస్తున్నాయని...కొన్ని ప్రతిపక్షాలు అధికార పార్టీకి వంతపాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: 'గణేష్ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి '