రాష్ట్రంలో కరోనా ఉరుముతూనే ఉంది. రోజుకు 10 వేలకు పైగా కేసులతో నిత్యం అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్తగా 56 వేల 490 నమూనాలు పరీక్షించగా... 10 వేల 4 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. పాజిటివిటీ రేటు సైతం 17.70 శాతానికి పెరిగింది. కొత్తగా నమోదైన కేసులతో... బాధితుల సంఖ్య 4 లక్షల 34 వేల 771కి చేరుకుంది. ఒక్కరోజులో 8 వేల 772 మంది డిశ్చార్జి కాగా... ఇప్పటివరకూ 3 లక్షల 30 వేల 526 మంది కోలుకున్నారు. ఒక్కరోజులో 85 మందిని మహమ్మారి బలిగొంది. దీంతో., ఇప్పటివరకూ నమోదైన మరణాల సంఖ్య 3 వేల 969కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం లక్షా 276 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కేసుల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా....తమిళనాడును వెనక్కినెట్టి రాష్ట్రం రెండోస్థానానికి చేరుకుంది.
అనంతపురం జిల్లాలో వైరస్ ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. కొత్తగా 973 కేసులు రికార్డు కాగా..... బాధితుల సంఖ్య 41 వేల 128కి పెరిగింది. అందులో 34 వేల 603 మంది కోలుకున్నారు. జిల్లాలో ఒక్కరోజులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.... మృతుల సంఖ్య 330కి చేరింది. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజులో 936 మందికి కరోనా నిర్ధరించినట్లు... అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.... 36 వేల 649కు పెరిగింది. కొత్తగా 9 మంది మరణించగా... జిల్లాలో ఇప్పటివరకూ మహమ్మారి బలిగొన్నవారి సంఖ్య 415కి పెరిగింది.
కర్నూలు జిల్లాలో కొత్తగా 686 కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 44 వేల 745కు పెరిగింది. ఆదోనిలో కేసుల పెరుగుదలతో కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో కొత్తగా 498 కేసులు నమోదు కాగా...... అందులో ఒక్క గుంటూరులోనే 129 ఉన్నాయి. జిల్లాలో బాధితుల సంఖ్య 35 వేల 761కి పెరిగింది. కొత్తగా ఏడుగురు మరణించారు. జిల్లాలో కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారి వివరాలను....'కొవిడ్ ట్రాకర్ గుంటూరు' అనే యాప్‌లో నమోదు చేయాలని.... కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు.
ఇదీ చదవండి