ETV Bharat / city

'ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరితే.. అక్రమ అరెస్ట్​లు చేస్తున్నారు' - జాబ్ క్యాలెండర్

పాత జాబ్ క్యాలెండర్​ను రద్దు చేసి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కలిపి నూతన క్యాలెండర్​ను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల హామిలో లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌ పేరుతో మోసం‌ చేశారని ఆరోపించారు. వెంటనే నూతన క్యాలెండర్​ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

telugu yuvatha and student leaders -protest
విద్యార్థి సంఘాల ధర్నా
author img

By

Published : Jul 1, 2021, 8:09 AM IST

పాత జాబ్ క్యాలెండర్​ను రద్దు చేసి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కలిపి నూతన క్యాలెండర్​ను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మంత్రివర్గ సమావేశంలో నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వం విస్మరించటం దుర్మార్గమని ఉద్యోగ పోరాట సమితి ధ్వజమెత్తింది. నిరుద్యోగుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోలేదని, నిరసనలు చేపట్టిన యువతపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై శ్వేతపత్వం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చి కేవలం 10వేలు ప్రకటించడం మోసమేమనని మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు యువత ఆధ్వర్యంలో అఖిలపక్షం విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్​పై నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఎన్నికల సమయంలో జగన్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌ పేరుతో ప్రజలను మోసం‌ చేశారని నేతలు ఆరోపించారు. జాబులు ఇవ్వమని అడిగితే జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. జాబ్ క్యాలెండర్‌ మార్చే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అరెస్ట్ అయిన వారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ మరియు ఇతర సంఘాల నాయకులు ఉన్నారు.

సచివాలయ ముట్టడికి ఏబీవీపీ యత్నం..

జాబ్ క్యాలెండర్​ను సవరించాలని సచివాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరంలో..

రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటిలోని ఖాళీల భర్తీ చేసే విధంగా నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని.. విజయనగరంలో విద్యార్థి, నిరుద్యోగ, యువజన సంఘాల నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కోట కూడలిలో ఎస్ఎఫ్ఐ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సాధన సమితి, ఏఐవైఎఫ్ సంఘాల నేతలు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్​ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనల సందర్భంగా పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్​ను తక్షణమే రద్దు చేయాలని చీపురుపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సతీష్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో చీపురుపల్లి బస్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ తీశారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలంటూ సతీష్ దేవ్ సింగ్ డిమాండ్ చేశారు.

కడపలో..

పాత ఉద్యోగ క్యాలెండర్​ను రద్దు చేసి కొత్త ఉద్యోగాల క్యాలెండర్​ విడుదల చేయకుంటే ఛలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కడపలో విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ కూడలిలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్​యూ, డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. చేతులకు సంకెళ్ల తరహాలో తాళ్లు కట్టుకొని మోకాళ్లపై నిలబడి రాష్ట్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ.. వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కర్నూలులో..

విద్యార్ధి సంఘల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరితే అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పాలన చుడలేకే కళ్లకు గంతులు కట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు.

గుంటూరులో ..

జాబ్ క్యాలెండర్​ను రద్దు చేయాలంటూ గుంటూరులో నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జాబ్ లెస్ క్యాలెండర్​తో నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లుచల్లిందని మండిపడ్డారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని స్థానిక పొలీస్ స్టేషన్​కి తరలించారు.

ఇదీ చదవండి:

JAGAN BAIL: జగన్ బెయిల్​ రద్దు పిటిషన్​పై.. సీబీఐ కోర్టులో నేడు విచారణ

కరోనా ఎఫెక్ట్​: పర్యటక రంగానికి 4 ట్రిలియన్‌ డాలర్ల నష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.