ETV Bharat / city

ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం - ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం వార్తలు

జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తెలుగు సైనికులు మృతిచెందారు. మరో సైనికాధికారి, సిపాయి కూడా మరణించారు. కశ్మీరులో ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

jawan died
jawan died
author img

By

Published : Nov 9, 2020, 7:00 AM IST

Updated : Nov 9, 2020, 9:32 AM IST

జమ్మూ - కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్‌(26), ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(36) ఉన్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం గాలింపు చేపట్టింది. అయితే ఉగ్రవాదులు కాల్పులకు దిగారని సైనిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఏకే రైఫిల్‌తో పాటు రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.

సైన్యంలో చేరాలన్న లక్ష్యంతో..

ఎదురుకాల్పుల్లో మృతి చెందిన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్‌(26)కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌కు చెందిన సైనిక కమాండర్‌ కూతురు సుహాసిణిని ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఇంకా పిల్లలు కాలేరు. గత డిసెంబరులో స్వగ్రామానికి వచ్చిన మహేష్‌ అదే నెలలో తిరిగి విధులకు బయలుదేరారు. ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో పట్టుదలతో చదివి 2014-15లో మహేష్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మహేష్‌ వీలున్న ప్రతి వారం, 10 రోజులకు ఒకసారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేవారు. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేవారు.

18 సంవత్సరాలుగా సైనిక సేవలో...

కశ్మీర్‌ ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని.. ఐరాల పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడి,్డ సుగుణమ్మ కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(36) గత 18 సంవత్సరాలుగా మద్రాస్‌ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతడు హవల్దార్‌గా పనిచేస్తూ కమెండో శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్‌కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకాయం సోమవారం రాత్రి స్వగ్రామం చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు. జవాన్ మృతి రెడ్డివారిపల్లె శోక సముద్రంలో మునిగి ఉంది తన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తండ్రి ఇతర కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'చొరబాటు కుట్ర భగ్నం'లో మరో జవాను వీరమరణం

Last Updated : Nov 9, 2020, 9:32 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.