ETV Bharat / city

ఈనెల 28న ఆన్​లైన్​లో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 5వ వార్షికోత్సవం - రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వార్తలు

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఐదో వార్షికోత్సవ సమావేశాలు ఈనెల 28న ఆన్​లైన్​లో జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు తమ వెబ్​సైట్​ను సందర్శించాలని కోరారు.

ఈనెల 28న ఆన్​లైన్​లో తెలుగు సమాఖ్య 5వ వార్షికోత్సవం

author img

By

Published : Jun 25, 2020, 10:27 PM IST

Updated : Jun 25, 2020, 11:39 PM IST

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 5వ వార్షికోత్సవ సమావేశాలు ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్​లైన్​లో జరగనున్నాయి. ఈమేరకు సమాఖ్య అధ్యక్షుడు ఆర్​.సుందరరావు ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖుల సందేశాలు, 9 రంగాల విశిష్ట కళాకారుల ప్రదర్శనలు, అంతర్జాతీయ కవి సమ్మేళనం ఉంటాయని అన్నారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు www.rashtretaratelugusamakhya.com వెబ్​సైట్​ను సందర్శించాలని సూచించారు.

ఆసక్తి కలవారు నమోదు చేసుకోవాలి

తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తోన్న తెలుగు వారిని, తెలుగు సంస్థలను ఏకతాటిపై తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పడింది. 18 రాష్ట్రాల్లో సభ్యులను కలిగి ఉంది. 5వ వార్షికోత్సవానికి హాజరు కావాలనుకునే భాషాభిమానులందరూ.. https://forms.gle/oiygygxV1hmDm3j37 ద్వారా నమోదు చేసుకోవచ్చు. కరోనా సమస్యలు, ప్రభావం వంటి అంశాలను ప్రస్తావించేందుకు ఆసక్తి ఉన్న కవులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

telugu federation
వార్షికోత్సవ కార్యక్రమ వివరాలు

ఇదీ చూడండి..

ఇళ్ల పట్టాల పంపిణీకి ఆటంకం కలగకుండా చర్యలు: మంత్రి బొత్స

Last Updated : Jun 25, 2020, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.