ETV Bharat / city

సినిమా షూటింగులకు ప్రభుత్వం అంగీకారం - మంత్రి పేర్ని నాని

రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా తగు చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని సినీ ప్రముఖులు తెలిపారు. లాక్‌డౌన్‌లో షూటింగ్‌లకు అనుమతి సహా.. ఇతర సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని చిరంజీవి చెప్పారు. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని పునరుద్ధరించేందుకు అంగీకరించామని మంత్రి నాని వెల్లడించారు.

cinema celebraties meet with cm jagan
సీఎం జగన్‌తో సినీప్రముఖుల భేటీ
author img

By

Published : Jun 9, 2020, 7:51 PM IST

సీఎం జగన్‌తో సినీప్రముఖుల భేటీ

లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉన్న సినీపరిశ్రమ సమస్యలకు పరిష్కారం, పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్‌తో తెలుగు సినీప్రముఖులు సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వారంతా.. విజయవాడ కరకట్ట సమీపంలోని ఓ అతిథి గృహంలో బసచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతా కలసి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌, దిల్‌రాజు, సి.కల్యాణ్‌ సీఎంతో భేటీ అయ్యారు. చిన్న సినిమాల నిర్మాతల సమస్యలు, నందిఅవార్డులు సహా పలు అంశాలపై సీఎం జగన్‌తో సినీప్రముఖులు చర్చించారు. మంత్రి పేర్ని నాని, రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ విజయ్ చందర్, వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో షూటింగ్​లకు అనుమతిచ్చారు: చిరంజీవి

సీఎం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలన్నిటిపైనా సానుకూలంగా స్పందించారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలనుకున్నామని, రాష్ట్రంలో షూటింగ్‌లకు ముందుగానే అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు. లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉన్న థియేటర్ల యజమానులను ఆదుకునేందుకు వినోదపన్ను మినహాయించాలని కోరామన్నారు. థియేటర్ల టికెట్ల జారీలో పారదర్శకత, నంది పురస్కారాలకు ప్రభుత్వ ప్రోత్సాహం, కరోనా లాక్‌డౌన్‌లో తీవ్రంగా దెబ్బతిన్న సినీపరిశ్రమకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా పన్నుమినహాయింపు వంటి అంశాలను సీఎంతో చర్చించామని చెప్పారు. వాటి పరిష్కారానికి మంత్రులు, అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు.

జులై 15 తర్వాత షూటింగ్​లు: పేర్ని నాని

జులై 15 తర్వాత షూటింగ్‌లకు అనుమతించామని, త్వరలోనే విధివిధానాలు విడుదల చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖకు వచ్చే సినీ ప్రముఖులకు స్టూడియోలు, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. చిన్న సినిమాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండింగ్‌ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసేందుకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లోనే టికెట్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 2019-20 ఏడాదికిగాను నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సినిమా పరిశ్రమ కట్టుబడి ఉంటుందని, రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి మరోసారి చర్చలు జరుపుతామని సినీప్రముఖులు, ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

'అర్హులకు పథకాలు అందకపోతే.. పరిహారమివ్వాల్సిందే..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.