పశ్చిమ బంగాల్‌లో తెలుగును అధికార భాషగా గుర్తించడం పట్ల.. శతాబ్ద కాలంగా స్థానికంగా నివసిస్తున్న ప్రవాసాంధ్రుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటినుంచో చేస్తున్న వినతులకు ఎట్టకేలకు స్పందించిన మమత ప్రభుత్వానికి.. ఖరగ్‌పూర్‌లోని తెలుగువారు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వ సదుపాయాల పరంగా తెలుగువారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు.. ఈ నిర్ణయంతో తెర పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమబంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థఛటర్జీ.. సోమవారం తెలుగుపై నిర్ణయం వెలువరించగానే ఖరగ్‌పూర్‌లో అధికంగా నివసించే తెలుగువారు సంబరాలు చేసుకున్నారు. ఇందుకోసం కృషి చేసిన తృణమూల్ ఎమ్మెల్యే ప్రదీప్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఏళ్లుగా సమస్యను పట్టించుకోని మమత సర్కారు.. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు నిర్ణయం తీసుకుందని భాజపా నేతలు విమర్శించారు. అయినప్పటికీ భాజపా బలానికి వచ్చిన ముప్పేమీ లేదని ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: