ETV Bharat / city

NGT: నిబంధనలు ఉల్లంఘించిన ఏపీని కచ్చితంగా శిక్షించాల్సిందే: తెలంగాణ - NGT on Rayala lift project

NGT
NGT
author img

By

Published : Sep 30, 2021, 7:31 PM IST

Updated : Sep 30, 2021, 9:00 PM IST

19:28 September 30

నిబంధనలకు విరుద్ధంగా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందన్న తెలంగాణ

నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ను కచ్చితంగా శిక్షించాల్సిందేనని జాతీయ హరిత ట్రైబ్యునల్(national green tribunal)​ ఎదుట తెలంగాణ వాదించింది. కోర్టు ధిక్కారం కింద శిక్షించే అధికారం ఎన్జీటి(ngt)కి ఉందని తెలిపింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం ముందు తెలంగాణ వాదనలు వినిపించింది.

అన్ని కోణాల్లో పరిశీలించి కోర్టు ధిక్కారంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్జీటీ (ngt) స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ముగింపు వాదనలకు ఏపీకి అవకాశం ఇచ్చింది. తదుపరి తీర్పును రిజర్వు చేయనున్నట్లు ఎన్జీటీ చెప్పింది.

అసలు తెలంగాణ ఫిర్యాదు ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ( Rayalaseema Lift Irrigation) పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని.. తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్​పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యకార్యదర్శికి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలాంటి నీటి కేటాయింపులు, అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టు అని లేఖలో పేర్కొన్నారు.

బేసిన్ వెలుపలకు పెద్దమొత్తంలో నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని రజత్​ కుమార్​ తన లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని... రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీ లంకామల్లేశ్వర, శ్రీ పెనుసిలా నరసింహ, శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ప్రాజెక్టు కాల్వలకు పది కిలోమీటర్ల పరిధిలోపే ఉన్నాయని రజత్ కుమార్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు, ఛాయాచిత్రాలను లేఖతో జతపరిచారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వకుండా, తగిన అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టవద్దని ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 2020 అక్టోబర్​లో జరిగిన అత్యున్నత మండలి సమావేశంలోనూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి ముందు రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని తెలంగాణ ప్రస్తావించిందని... కేంద్ర జలసంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీని ఆదేశించిందని వివరించారు. వీటన్నింటి నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల పరిశీలన నేపథ్యంలో న్యాయ, హైడ్రాలజికల్, పర్యావరణ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలని రజత్ కుమార్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను కోరారు.

ఇదీ చదవండి

Palamuru ranga reddy lift irrigation: పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం

Last Updated : Sep 30, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.