ETV Bharat / city

English medium in Telangana: అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం! - English medium

Cabinet on Education: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేయాలని కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని తీర్మానించింది. మహిళా, అటవీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్ ములుగు కళాశాలలో అటవీవిద్య అభ్యసించిన వారికి అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది.

English medium
English medium
author img

By

Published : Jan 18, 2022, 7:08 AM IST

Cabinet on Education: విద్యారంగంపై తెలంగాణ మంత్రివర్గం సుధీర్ఘంగా చర్చించింది. గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్న కేబినెట్‌ గ్రామాల్లో ఆర్థిక పరిపుష్ఠితో పిల్లల విద్య,భవిష్యత్‌ పట్ల ఆలోచన పెరిగిందని గుర్తించింది. గ్రామాల్లో ఆంగ్లమాధ్యమానికి డిమాండ్ పెరుగుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనివార్యత పెరిగిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. విద్యార్థులను ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ, ఆకర్షణీయంగా విద్యాలయాలు తీర్చిదిద్దడం, క్రీడామైదానాలు, తదితర వసతుల ఏర్పాటు తదితరాలపై కార్యాచరణ చేపట్టాలని మంత్రివర్గ నిర్ణయించింది. ప్రైవేట్, కార్పోరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.

అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం

విద్యాసంస్థల్లో ఫీజుల అంశంపై చర్చ
fees discussion in private education: రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల అంశంపై కేబినెట్ చర్చించింది. పేదలకు విద్యను చేరువ చేసేలా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆంగ్ల విద్యాబోధన, ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించేలా పూర్తి అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందించేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. రానున్న శాసనసభా సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.

‘మన ఊరు – మన బడి’ పేరిట వినూత్న కార్యక్రమం
mana ooru- mana badi programme: ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రంలో ‘మన ఊరు – మన బడి’ పేరిట వినూత్న కార్యక్రమం అమలు కానుంది. ఇందుకోసం మూడేళ్ళలో 7వేల 289 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలోని 26 వేల 65 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశల వారీగా డిజిటల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రుల బృందం ఇప్పటికే పలుదఫాలు కసరత్తు చేసి విధివిధానాలను రూపొందించింది. 2021 – 22 విద్యాసంవత్సరంలో మొదటి దశలో మండల కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకొని విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న 9వేల123 పాఠశాలల్లో ముందుగా కార్యక్రమం అమలు చేయాల్సి ఉంది. కార్యక్రమం క్రింద 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించారు.

మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని రావాలని సీఎస్​ను ఆదేశించింది. అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే కేబినేట్ సమావేశానికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదివిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విభాగంలోని ఉద్యోగాల్లో 25శాతం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగానికి 50 శాతం, ఫారెస్టర్స్ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి:

Tungabhadra Upper Canal bridge in Anantapur: కూలిన తుంగభద్ర ఎగువ కాలువ వంతెన.. మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.