ETV Bharat / city

TS Academic calendar: పాఠశాల విద్యా సంవత్సరం ప్రకటన.. పది పరీక్షలు అప్పుడే..! - బడులకు సెలవులు

తెలంగాణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 166 రోజులు ప్రత్యక్ష బోధన జరగనుంది. ఇప్పటివరకు జరిగిన 47 రోజుల ఆన్ లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకొని.. 213 రోజుల పని దినాలతో పాఠశాల విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బడులకు సెలవులను తగ్గించని విద్యాశాఖ.. దసరాకు 12 రోజులు, సంక్రాంతికి 6 రోజులు ప్రకటించింది. పదో తరగతికి ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రిఫైనల్ పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల, వచ్చే నెలలో ఇన్​స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహించనున్నారు.

TS Academic calendar
పాఠశాల విద్యా సంవత్సరం
author img

By

Published : Sep 4, 2021, 6:50 PM IST

Updated : Sep 4, 2021, 6:59 PM IST

పాఠశాలల విద్యా సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. ఈనెల 1న ప్రారంభమైన ప్రత్యక్ష తరగతులు.. ఏప్రిల్ 23 వరకు 166 పని దినాలు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 47 రోజుల ఆన్​లైన్ తరగతులను కూడా పరిగణనలోకి తీసుకొని.. 213 పని రోజులతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది.

పదో తరగతి విద్యార్థుల షెడ్యూల్​..

ఒకటి నుంచి 10 తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేసి.. మార్చి 1 నుంచి పునశ్ఛరణ తరగతులు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు డిసెంబరు 1 నుంచి 8 వరకు ఎస్ఏ వన్ పరీక్షలు జరుగుతాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు అక్టోబరు 5న ఎఫ్ఏవన్, ఫిబ్రవరి 28న ఎఫ్ఏ 2, ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతికి అక్టోబరు 5 నాటికి ఎఫ్ఏ 1, డిసెంబరు 31 వరకు ఎఫ్ఏ 2 పరీక్షలు పూర్తి చేసి.. ఫిబ్రవరి నెలాఖరు వరకు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్​లో పదో తరగతి వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సెలవులు యాథావిధిగానే..

ఈ విద్యా సంవత్సరం సెలవుల సంఖ్యను యథావిధిగా కొనసాగిస్తూ విద్యా క్యాలెండర్​ను ప్రకటించింది. పాఠశాలలకు అక్టోబరు 6 నుంచి 17 వరకు పన్నెండు రోజులు దసరా సెలవులు ఇస్తారు. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు22 నుంచి 28 వరకు.. ఏడు రోజులు క్రిస్టమస్​ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 16 వరకు 6 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇన్​స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 21 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా స్థాయి.. అక్టోబరు చివరి వారంలో రాష్ట్ర స్థాయి.. డిసెంబరు లేదా జనవరిలో జాతీయ స్థాయి ఇన్​స్పైర్ పోటీలు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది.

ప్రత్యేక రోజుల్లో ఉత్సవాలు..

వచ్చే నెలలో దివంగత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఎన్​సీఈఆర్​టీ మార్గదర్శకాల ప్రకారం అన్ని పాఠశాలల్లో జాతీయ ఆవిష్కరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ వెల్లడించింది. పాఠశాలల్లో ప్రతీ నెల మొదటి శనివారం బాలసభ, 3వ శనివారం క్విజ్ పోటీలు, 4వ శనివారం స్వచ్ఛ పాఠశాల, హరిత హారం, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఈనెల 9న తెలంగాణ భాష దినోత్సవం, డిసెంబరు 22న జాతీయ గణిత దినం, డిసెంబరు లేదా జనవరిలో పాఠశాల వార్షికోత్సవం, ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవం, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించాలని విద్యా శాఖ ప్రకటించింది. నవంబరు, జనవరి, ఫిబ్రవరిల్లో స్కూల్ కాంప్లెక్సు సమావేశాలు జరపాలని స్పష్టం చేసింది. ప్రతీ విద్యార్థికి ఈ విద్యా సంవత్సరంలో రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు జరపాలని తెలిపింది.

ఇదీ చదవండి: Best teachers award: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం నిలిపివేత

Last Updated : Sep 4, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.