తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని ఆ రాష్ట్ర మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో ఈటల రాజేందర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈటలకు తెలంగాణ ఎన్‌ఆర్ఐ అమెరికా ఫోరం మద్దతు తెలిపింది.
రాష్ట్రంలో ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభమైంది. తప్పుడు ఆరోపణలతో నన్ను బయటకు పంపారు. ప్రలోభాలకు లొంగలేదనే నిందలు వేస్తున్నారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడను. నేను ప్రజలనే నమ్ముకున్నా. మద్దతు తెలిపినందుకు ఎన్‌ఆర్‌ఐలకు ధన్యవాదాలు.- ఈటల రాజేందర్
ఇదీ చదవండి..
రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు