Telangana National Unity Vajrotsavam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో... ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో ర్యాలీని మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణువారియర్ ప్రారంభించారు. జడ్పీ సెంటర్ నుంచి సర్దార్ పటేల్ మైదానం వరకు ప్రదర్శన చేపట్టారు. ఆ కార్యక్రమంలో జాతీయ జెండాలు చేతబట్టి సమైక్యతా ర్యాలీలో... విద్యార్థులు యువత, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి జాతీయ జెండా పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. కోలాటాలు బతుకమ్మలు ఆడుతూ మహిళల సందడి చేశారు. 17 అడుగుల బతుకమ్మ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. పట్టణ పురవీధులలో జాతీయ జెండాలు చేతబట్టి విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, కవులు తెలంగాణ ఉద్యమకారులు ప్రదర్శలో పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ, బోనాలు డప్పు చప్పుళ్లతో పిర్లు కోలాటాలతో, ర్యాలీ కొనసాగింది. వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ర్యాలీని ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
ఇవీ చదవండి: