ETV Bharat / city

కల్నన్ సంతోశ్ చివరి క్షణాల్లో మనసులో రాసుకున్న ప్రేమలేఖ! - Colonel Bikkamalla Santosh Babu latest news

ప్రియమైన మృత్యుదేవతకు... ఇదేంటి ప్రియమైన అని సంబోధించాడు ఎవరు ఈ వ్యక్తి అనుకుంటున్నావా... అందరూ నన్ను చూసి దూరంగా పారిపోతుంటారు.. కలలో కూడా నన్ను తలచుకోరు.. మరి ఇతనేంటి నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని ఆలోచిస్తున్నావా..? ఒళ్లంతా నెత్తురోడుతున్నా... కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నా... పెదవులపై చిరునవ్వు... కళ్లలో గర్వం.. గుండెళ్లో ధైర్యంతో... నిను చేరాలని ఎదురు చూస్తున్నా... ఈ పరిస్థితిలో కూడా ఇంత సంతోషంగా ఎందుకున్నానో తెసుకుంటేనైనా నా నుంచి దూరంగా పారిపోతున్న నువ్వు దరికి చేరుతావని ఆశిస్తున్నా.. ఇంతకీ నా కథ ఏమిటంటే...

Telangana mourned the death of Colonel Santosh Babu
కల్నన్ సంతోశ్ చివరి క్షణాల్లో మనసులో రాసుకున్న ప్రేమలేఖ!
author img

By

Published : Jun 17, 2020, 12:39 PM IST

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మాతృభూమి అంటే అమితమైన ఇష్టం. మొదట్లో అది ఇష్టమో.. స్నేహమో.. మోహమో తెలియదు గానీ.. ఆ భావన నాతోనే ఎదుగుతూ నాలో నాకు స్థానం లేకుండా నన్ను ఆక్రమించింది. ఒక్క నిమిషం కాదు కదా ఒక్క క్షణం ఎడబాటు కూడా భరించలేకపోయేవాడిని. ఎవరైనా నా దేశాన్ని పల్లెత్తి మాటన్నా ఊరుకునే వాడిని కాదు. అసలు ఏమి అందం నా దేశానిది. చెప్పాలంటే మాటలు లేవు.. రాయాలంటే అక్షరాలు సరిపోవు.

సంస్కృతి, సంప్రదాయాలను ఆభరణాలుగా ధరించి... శాంతి సౌభ్రాతృత్వాలను వస్త్రాలుగా కప్పుకుని, చూడగానే మైమరచిపోయే ప్రకృతి అందాలు, నదుల హొయలు, పర్వతాల గంభీరాలు, సముద్రాల అలలు ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా అందానికే చిరునామాగా ఉండే నా మాతృభూమి ఆసేతు హిమాచలం వరకు అణువణువు అందమైనదే... దేశ భద్రతలో చేనుకు కంచె వేసినట్లుగా గాఢ నిద్రలో కూడా కాపుకాస్తున్నట్లే కలలు కనే వాడిని.

ఎంతో శ్రమపడి రక్షణశాఖలో ఉద్యోగంలో సంపాదించాను. నా మాతృ భూమికి ఇసుక రేణువంత ఇబ్బంది కలిగినా నేను ఊరుకోను. తన తలంపు లేకుండా క్షణకాలం కూడా గడపలేను. అంచెలంచెలుగా ఎదుగుతూ కల్నన్​ స్థాయికి చేరుకున్నాను... డ్రాగన్​ సరిహద్దు తూర్పు లద్దాఖ్​లో కనుగుడ్డుకు కంటి పాపలా రక్షణ కాస్తూ విధులు నిర్వహిస్తున్నాను.

పైకి బాయి బాయి అంటూ... బాహాబాహీకి దిగుతున్న శత్రుమూక తీరుతో నిత్యం అప్రమత్తంగానే ఉంటున్నాం.. సమద్రమట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో... ఎముకలు కొరికే చలిలో డ్రాగన్​ సైనికుల ఆగడాలను తిప్పికొడుతూనే ఉన్నాం... ఇంతలో ఊహించని ఘటన... శత్రుమూక దాడికి పాల్పడుతోంది... ఎముకలు కొరికే చలి ఇబ్బంది పెడుతున్నా.. పాదం ముందుగు సాగకున్నా... ఒక్కో అడుగూ కలుపుకుంటూ అణువణువూ గాలిస్తున్నాను. నా బృందంలోని వారంతా అప్పటికే సత్తువ నశించి కూలబడిపోయారు. కర్రలతో, ఇనుప రాడ్లతో.. పిడుగుద్దులతో దూసుకొస్తున్న శత్రుమూకకు మీరు ఎదురవ్వొద్దు సార్​ అంటూ నా సహచరులు హెచ్చరిస్తున్నారు. నేనెలా ఆగగలను. కన్న తల్లిని ఎవరైనా పల్లెత్తు మాటన్నా ఊరుకోము.. అలాంటిది మాతృభూమిపైకి ఎవరైనా దండెత్తి వస్తుంటే చూస్తుండగలమా.

దేహంలోని అణువణువును ఆయుధంగా మార్చుకుని.. శత్రుగుంపుతో తలబడి... చేతికందినవాడిని చిత్తుచేస్తూ... దెబ్బలను ఒడుపుగా తప్పించుకుంటూ.. పోరాడుతున్నాను.. ఇంతలో ఎవ్వడో దొంగ దెబ్బ తీశాడు. అందేంటో ఎదురుగా మృత్యువు కనబడుతున్నా... మనసు ఒకటే చెబుతోంది. వాళ్లలో ఒక్కడిని కూడా ప్రాణాలతో విడిచి పెట్టొద్దని. చుట్టుముట్టిన శత్రుమూక చేసే దాడిలో దేహంలోని ఒక్కో భాగం సత్తువ కోల్పోతోంది. చేతులను శరాలుగా చేసుకుని.. కాళ్లని రాడ్లుగా మార్చుకుని పోరాడాను.. నా సత్తువ నిలవలేక పోయింది. నెత్తురు ధారగా కారింది. దూరంగా కొండపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. దాని నీడ శ్వేత వర్ణంలా మెరిసిపోతున్న మంచు పలకలపై పడి దాని ప్రతిబింబం నా కనుపాపలపై పడుతోంది. ఆ వెలుగుకు నా కళ్లు అశోక చక్రాల్లా మెరిశాయి.

లేవాలంటే లేవలేక పోతున్నా.. నాకు పూర్తిగా స్పందన లేదు. అప్పుడు కనిపించింది మొదటి సారి నీ రూపు. నా ప్రాణం తీసుకునేందుకు దగ్గరగా వస్తున్నావు గానీ.. అంతే వేగంగా వెళ్లిపోతున్నావు. నీ కళ్లలో అప్పుడు చూశాను భయం. చుట్టూ మసకబారుతోంది. కానీ కళ్లు మాత్రం దేనినో వెతుకుతున్నాయి.

ఆ గాలి వేగానికి జాతీయ జెండా రెపరెపలాడుతూ కంటతడి పెట్టినట్లు కనిపిస్తోంది. అప్పుడు కూడా నాకు ఏ బాధా అనిపించలేదు సరికదా చాలా గర్వంగా ఉంది. ఒక్కడిని నా గడ్డపై అడుగు పెట్టనివ్వలేదు. నా బాధను చూసి నిలవలేక ఎగురుతున్న జెండా నా దేహంపై పడింది. నెత్తుటి మడుగులో తడిసి హృదయ విదారకంగా విలపిస్తోంది. తనను వదిలి వెళ్లిపోవద్దంటూ గుండెలపై పడి రోదిస్తోంది. అయినా నేనెక్కడికి వెళ్తాను తనలోనే కలిసిపోతాను. ఈ దేహాన్ని వదిలేస్తానేమో నా దేశాన్ని వదిలిపోతానా.. తొందరగా ఈ దేహాన్ని వీడి నా మాతృభూమిలో కలిసి పోదామనుకుంటుంటే మృత్యుదేవతవైన నీవేమో నాకు భయపడి దూరం పోతున్నావు. అందుకే నా ఈ కథ నీకు తెలియజేస్తూ ఈ మంచుపలకపై నెత్తుటి సిరాతో ప్రేమ లేఖ రాస్తున్నాను. ఈ మంచు కరిగి నీ దరికి చేరి నా విన్నపం నీకు తెలియజేస్తుందని.. వెంటనే నా దగ్గరకొస్తావని ఆశిస్తున్నాను... ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ.. కల్నన్​ సంతోష్​ బాబు.

ఆశయాన్ని తుపాకీగా చేసుకుని... మనసుని తూటాగా మార్చి... చూపుల శరాలతో... ప్రాణాలను పణంగా పెట్టి.. మాతృభూమి రక్షణ కోసం అయిన వాళ్లకు దూరంగా ఉంటూ... నిత్యం మృత్యువుతో స్నేహం చేస్తూ... నూరు కోట్ల పైబడిన భారతీయులకు అండగా తానున్నాననుకుంటూ.. రెపరెపలాడుతున్న జాతీయ జెండాను మనసులో తలచుకుంటూ... శత్రుమూక కుట్రదాడిలో ప్రాణాలొడ్డి పోరాడి... మృత్యువును కూడా ఆనందంగా స్వాగతిస్తూ... అమరుడైన సైనికుడా వందనం...

ఇదీ చదవండి:

సూర్యాపేటలో విషాదఛాయలు.. బంధువుల పరామర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.