మావోయిస్టు హరిభూషణ్, సారక్కల మృతిని తెలంగాణ కమిటీ ధ్రువీకరించింది. కరోనా లక్షణాలతో... ఈనెల 21న హరిభూషణ్, 22న సారక్క చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ప్రజల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించామని ప్రకటించింది.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మరగూడకు చెందిన హరిభూషణ్.... ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. 1991లో ఆయన అటవీ దళంలో చేరారు. డిప్యూటీ కమాండర్‌గా, ఆర్గనైజర్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. హరిభూషణ్.. దండకారణ్యంలోని ఇంద్రావతి ఏరియాలో ఆస్తమాతో మృతి చెందినట్లు తెలిపారు. హరిభూషణ్, సారక్కల మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది.
ఇదీ చదవండి: