కరోనా దృష్ట్యా ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27,589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలనే నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని 27,251 మంది విద్యార్థులు, మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని బోర్డు తీర్మానించింది.
కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొందరికి గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయంచినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: