తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది ఐసెట్‌కు 45,975మంది విద్యార్థులు హాజరవ్వగా... 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు.
హైదరాబాద్‌కు చెందిన శుభశ్రీ 159.5 మార్కులతో రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించింది. నిజామాబాద్‌కు చెందిన సందీప్ 2వర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన అవినాష్ సిన్హా మూడో ర్యాంక్ కైవసం చేసుకున్నారు. విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకూడదనే ఉద్దేశంతో.... కఠిన పరిస్థితుల్లోనూ పరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటించామని పాపిరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: