ETV Bharat / city

Agri Gold and Akshaya Gold cases: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు - agri gold cases transferred to eluru court

Agri Gold and Akshaya Gold cases: తెలంగాణ హైకోర్టులో ఉన్న అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులను ఏపీకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Agri Gold and Akshaya Gold cases
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులు
author img

By

Published : Feb 25, 2022, 4:18 PM IST

Agri Gold and Akshaya Gold cases: హైకోర్టులో ఉన్న అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు తిరిగింది. ఈ రెండు కేసులనూ ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.50 కోట్లనూ ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది. విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

తమ ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. అనంతరం అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ సంబంధించిన కేసులన్నింటిపై విచారణ ముగించినట్లు వెల్లడించింది. కాగా ఏడేళ్లుగా అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఇదీ అగ్రిగోల్డ్​ వ్యవహారం..
అగ్రిగోల్డ్​ యాజమాన్యం.. ఆకర్షణీయ పథకాలతో దాదాపు 32 లక్షల మంది డిపాజిట్‌దారులను మభ్యపెట్టి దాదాపు రూ.6,380 కోట్లను సేకరించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఏడు రాష్ట్రాల్లో డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట ఏజెంట్లను చేర్చుకున్న సంస్థ.. వారి ద్వారా పెద్దఎత్తున డిపాజిట్లను సేకరించింది. డిపాజిటర్ల పేరిట కేటాయించినట్లు చెప్పిన ప్లాట్లకు హద్దులు నిర్ణయించకుండా, లొకేషన్‌ చెప్పకుండా, వాస్తవ మార్కెట్‌ విలువ ప్రస్తావించకుండా, సర్వే నంబర్లు వెల్లడించకుండా మాయ చేసింది.

పేరుకే స్థిరాస్తి వ్యాపారమని చెప్పినా.. ఆర్‌బీఐ నుంచి అనుమతులు లేకుండానే డిపాజిట్లు సేకరించింది. ఈ నిర్వాకాన్ని గుర్తించిన సెబీ వెంటనే వ్యాపార కార్యకలాపాల్ని అపేసి డిపాజిట్‌దారులకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దాన్ని పట్టించుకోని ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు.. కొత్త కంపెనీలను తెరపైకి తెచ్చి కమీషన్‌ ఏజెంట్ల ద్వారా భారీగా డిపాజిట్లు సేకరించారు. ప్రక్రియ కాస్తా పొంజి స్కామ్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్లాట్లు ఇస్తామంటూ 32లక్షల మంది నుంచి తీసుకున్న సొమ్ముకు చివరకు దాదాపు 5.3లక్షల ప్లాట్లు మాత్రమే వెంచర్లలో ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

ఇదీచూడండి:AGRI GOLD: హామీలు నెరవేర్చేదెన్నడు... అగ్రిగోల్డ్ బాధితుల వేదన తీరేదెన్నడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.