ETV Bharat / city

Jagan bail cancellation petition: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు - జగన్ పై సీబీఐ కేసులు

Jagan bail cancellation petition
Jagan bail cancellation petition
author img

By

Published : Dec 27, 2021, 3:13 PM IST

Updated : Dec 27, 2021, 3:41 PM IST

15:08 December 27

ఎంపీ రఘురామ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ముగిసిన వాదనలు

Jagan bail cancellation petition: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్​ తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జగన్‌కు నోటీసులు ఇవ్వాలని కోరారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై వైఖరి ఏమిటని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఏమీ మార్పు లేదని సీబీఐ తరపు న్యాయవాది బదులిచ్చారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

హైకోర్టులో రఘురామ పిటిషన్.. ఎందుకంటే..
MP Raghurama petition on Jagan bail cancellation: అక్రమాస్తుల కేసులో.. ముఖ్యమంత్రి జగన్​తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి​ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

రఘురామ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు..
CBI court on YS Jagan's bail cancellation petition: జగన్, విజయసాయిరెడ్డి సాక్షులను ప్రలోభ పెడుతున్నారని, విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని సీబీఐ కోర్టులో రఘురామ వాదించారు. అయితే.. తాము ఎలాంటి షరతులూ ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్లు దాఖలు చేశారని జగన్, విజయ్ సాయిరెడ్డి సీబీఐ కోర్టులో వాదించారు.

సీబీఐ మాత్రం ఏమీ వాదించకుండా.. పిటిషన్లలోని అంశాలపై చట్టప్రకారం విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనల అనంతరం.. రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్డు కొట్టేసింది. అయితే.. సీబీఐ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ.. తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు(MP Raghurama petition in Telangana High Court) చేశారు. ఈ కేసులో ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇవాళ తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

Capital Issue in High Court: రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వాయిదా

Last Updated : Dec 27, 2021, 3:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.