ETV Bharat / city

Jagan assets case: అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దు - సీబీఐ

author img

By

Published : Dec 6, 2021, 4:12 PM IST

Updated : Dec 6, 2021, 4:56 PM IST

jagan disproportionate assets case
jagan disproportionate assets case

16:07 December 06

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో ముగిసిన వాదనలు

Jagan Assest Case: జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో ముగిసిన వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో సీబీఐ కోర్టు నిరాకరించిందని గుర్తు చేశారు. జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయన్న సీబీఐ.. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం జరుగుతుందని ప్రస్తావించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.

Telangana high court On Jagan Plea: జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై డిసెంబర్​ 3న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్​లో జగన్ ప్రస్తావించారు. సీఎంగా రోజువారీ విచారణకు హాజరైతే పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన వల్ల విచారణ ఆలస్యమవుతోందన్న వాదనలో నిజం లేదని పేర్కొన్నారు.

జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘పాలనా పనులతో పాటు ప్రొటోకాల్‌ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సీఎం హోదాలో ఉన్న ఆయనను కలవడానికి పలువురు కోర్టుకు ఎక్కువగా వస్తారు. దీనివల్ల అందరికీ ఇబ్బందులే. ఈ కేసుల్లో ఇతర నిందితుల కారణంగా విచారణలో స్టే వచ్చింది. పిటిషనర్‌ ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు పొందలేదు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి వారం హాజరయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో 11 కేసులున్నాయి. వీటిలో కొన్ని 2జీ కేసు కన్నా 5 రెట్లు సంక్లిష్టమైనవి. అందువల్ల విచారణకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిసారి హాజరుకావడం సాధ్యం కాదు. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి...’ అని పేర్కొన్నారు. సత్యం రామలింగరాజు కేసులో ఒక జడ్జిని పూర్తిగా కేటాయించి 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రెండేళ్లకుపైగా పట్టిందని ఆయన ఉదహరించారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుపై ఉన్న కేసులో ఎన్నిసార్లు హాజరయ్యారని ఆరా తీశారు. బిహార్‌ వంటి రాష్ట్రాల్లో నిందితులు హాజరైతే సాక్షులు మాట్లాడటానికి భయపడుతుంటారని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు లేవనుకుంటానని వ్యాఖ్యానించారు.

కేసు వివరాలు ఇలా..
CBI cases on Jagan: అక్రమాస్తుల కేసుల్లో జగన్​కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది సీబీఐ కోర్టు నిరాకరించింది. అయితే.. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాదే జగన్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భూయాన్ ధర్మాసనం డిసెంబర్ 3న విచారణ చేపట్టగా.. సీబీఐ వాదనలు వినిపించేందు కోసం డిసెంబరు 6వ తేదీకి విచారణ వాయిదా వేసింది. తాజాగా ఇవాళ సీబీఐ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు... తీర్పును రిజర్వు చేసింది.

ఇదీ చదవండి:

work with students: విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. వారితో ఏం చేయించిదంటే?

Last Updated : Dec 6, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.