ETV Bharat / city

Jagan Case: జగన్ అక్రమాస్తుల కేసు.. రఘురామ పిటిషన్‌కు నంబరు కేటాయించండి - TSHC on RRR Petition

TS HC on RRR Petition:ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని.. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిల్​ వేశారు. ఈ వ్యాజ్యంపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. వ్యాజ్యానికి నంబరు కేటాయించాలని ఆదేశించింది. కేసులో ప్రతివాదుల వాదనలను విన్నాక పిటిషన్‌ విచారణార్హతను తేలుస్తామంటూ.. విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది.

TS HC on RRR Petition
రఘురామ పిల్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశం..
author img

By

Published : Mar 8, 2022, 11:51 AM IST

Updated : Mar 9, 2022, 4:32 AM IST

TS HC on RRR Petition: సీఎం జగన్​ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని, ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ... ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. వ్యాజ్యానికి నంబరు కేటాయించాలని ఆదేశించింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆర్వోసీ, సెబీ, ఆదాయపన్ను విభాగాల వాదనలను విన్నాక పిటిషన్‌ విచారణార్హతను తేలుస్తామంటూ విచారణను ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది.

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు ‘నీకది.. నాకిది’పై దర్యాప్తు చేసి 11 అభియోగ పత్రాలను దాఖలుచేసిన సీబీఐ... బోగస్‌ కంపెనీల నుంచి జగన్‌ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఈడీ, ఆదాయ పన్ను విభాగాలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రఘురామకృష్ణరాజు గత ఏడాది జూన్‌ 24న పిల్‌ దాఖలుచేశారు. హైకోర్టు రిజిస్ట్రీ దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పెండింగ్‌లో ఉంచింది. పిటిషన్‌కు నంబరు కేటాయించేలా ఆదేశాలు జారీచేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పలుమార్లు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై గత వారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించి నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెలువరిస్తూ రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నంబరు కేటాయించాలని ఆదేశించింది.

పిటిషన్‌లోని అంశాలివే..
వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు చేకూర్చిన లబ్ధిపై దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని, అయితే సీబీఐ కొన్ని అంశాలకే పరిమితమైందని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2004లో రూ.11 లక్షల ఆదాయం ఉన్న జగన్‌.. 2009లో తండ్రి చనిపోయేనాటికి రూ.43వేల కోట్లు ఆర్జించడంపై దర్యాప్తు సమగ్రంగా జరగలేదన్నారు. జగతిలోకి హావ్‌డా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. దీనిపై ఐటీ, ఈడీలకు లేఖ రాసి సీబీఐ చేతులు దులిపేసుకుందన్నారు. యాగా అసోసియేట్స్‌ ద్వారా హిందూజా గ్రూపునకు, మాజీ ఎంపీ బాలశౌరికి, కిన్నెట పవర్‌ లిమిటెడ్‌, ఓఎంసీ-శైలజా గ్రూపు కంపెనీ, ఇండియా బుల్స్‌, మయాంక్‌ మెహతాలకు లబ్ధి చేకూర్చగా జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయన్నారు.

విజయసాయిరెడ్డి, భార్య, కుమార్తెలకు చెందిన నీల్‌డార్ట్‌ ఇన్‌ఫ్రా, కీలాన్‌ టెక్నాలజీల ద్వారా జగన్‌కు రావాల్సిన పెట్టుబడులను వసూలు చేసి మళ్లించినట్లు చెప్పారు. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌కు చెందిన సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌లోకి రూ.750 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, సాయిసూర్య వేర్‌హౌసింగ్‌, నెల్‌కాస్ట్‌ ఫైనాన్స్‌, ఎక్సెల్‌ ప్రోసాఫ్ట్‌, ఐ2ఎం ఇన్ఫోటెక్‌, సిగ్మా ఆక్సిజన్‌, నెల్‌కాస్ట్‌ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌ల నుంచి ఈ పెట్టుబడులు వచ్చినట్లు పాక్షిక దర్యాప్తు తర్వాత సీబీఐ గుర్తించిందన్నారు. బెంగళూరులో మంత్రి కమర్షియల్‌ మాల్‌ను రూ.65.40 కోట్లకే సొంతం చేసుకోవడం వెనుక ఉన్న సమాచారాన్ని సీబీఐ పట్టించుకోలేదన్నారు. పెండింగ్‌ కేసులతో రోజువారీ విచారణ చేపట్టడం సీబీఐ కోర్టుకు సాధ్యం కావడంలేదని, ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసేలా ఆదేశించాలని కోరారు.

ఎంపీల్యాడ్స్‌ దుర్వినియోగ ఫిర్యాదుపై నివేదిక ఇవ్వండి: ఏపీకి కేంద్రం లేఖ

నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ ల్యాడ్స్‌ని చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఆధునికీకరణకు ఉపయోగిస్తున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు గత ఏడాది సెప్టెంబర్‌ 20న ప్రధానికి రాసిన లేఖపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల నిర్వహణశాఖ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వివరణ కోరింది. ఎంపీ నిధుల వినియోగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో వార్షిక ఆడిట్‌ నిర్వహించడంలేదని, నిధుల కేటాయింపులో జరుగుతున్న ఉల్లంఘనలపై జిల్లాస్థాయిలో పరిశీలన జరగడం లేదంటూ రఘురామకృష్ణరాజు రాసిన లేఖలోని అంశాలపై వివరణ ఇవ్వాలని గణాంకాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ అరిందమ్‌ మోదక్‌ తాజాగా ఏపీ ప్రణాళికశాఖ కార్యదర్శి విజయకుమార్‌కు లేఖ రాశారు. ఎంపీ రాసిన లేఖపై వివరణ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2న నివేదిక పంపినప్పటికీ అందులో ఎంపీ రాసిన అంశాల ప్రస్తావన లేదన్నారు. ఇంతలో పీఎం కార్యాలయం రఘురామ లేఖలోని అంశాలపై వివరణ కోరిందని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: Maoists Letter : 'బాక్సైట్‌ తవ్వకాలు ఆపండి లేదా మన్యం విడిచి వెళ్లండి..లేదంటే'

Last Updated : Mar 9, 2022, 4:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.