ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ధర్మానసం ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ శిక్ష పడితే.. అప్పీల్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డిపై దాఖలైన కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఆయనపై ఇప్పటివరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు వివరాలన్నీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఆర్డీవో, తహసీల్దార్‌పైనా ధిక్కరణ వివరాలు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు ధిక్కరణ కేసులకే ఇద్దరు, ముగ్గురు జడ్జిలను పెట్టాల్సి వచ్చేలా ఉందని హైకోర్టు పేర్కొంది. తమ ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇదీ చూడండి: