ETV Bharat / city

Telangana GSDP: కొవిడ్‌ నుంచి బయటపడిన తెలంగాణ.. వృద్ధిలో పలు రంగాలు - Telangana After Covid

Telangana GSDP: కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితుల నుంచి తెలంగాణ పూర్తిగా బయటకు వచ్చింది. వైరస్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న ఆయా రంగాలు మళ్లీ గాడిన పడ్డాయి. రాష్ట్ర అర్థ గణాంకశాఖ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో రంగాల వారీ భాగస్వామ్యాన్ని విశ్లేషించింది.

Telangana GSDP
కొవిడ్‌ నుంచి బయటపడిన తెలంగాణ.... వృద్ధిలో పలు రంగాలు
author img

By

Published : Mar 21, 2022, 11:34 AM IST

Telangana GSDP: కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా బయటపడింది. కొవిడ్‌-19 నేపథ్యంలో దారుణంగా దెబ్బతిన్న పలు రంగాలు వృద్ధి బాటపడ్డాయి. రాష్ట్ర అర్థ గణాంకశాఖ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో రంగాల వారీ భాగస్వామ్యాన్ని విశ్లేషించింది. గత ఆర్థిక సంవత్సరం(2020-21) మొదట సవరించిన అంచనాలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రంగాలవారీగా వృద్ధిరేట్లను కేంద్ర గణాంకాలు, పథకాల అమలుశాఖ(ఎంఓఎస్‌పీఐ)కు అందించింది. కొవిడ్‌ మహమ్మారితో తయారీ రంగం; వాణిజ్యం; మరమ్మతులు; హోటళ్లు, రెస్టారెంట్లు; రైల్వేలు, విమాన రవాణాలు 2020-21లో దారుణంగా దెబ్బతినగా ఈసారి కుదుటపడ్డాయి.

విశ్లేషణ వివరాలు..

* ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, పశు సంవర్ధకం, అటవీ, మత్స్య పరిశ్రమ, మైనింగ్‌, క్వారీయింగ్‌లో 9 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదైంది. ఈ రంగాల్లో అంతకుముందు ఏడాది వృద్ధిరేటు 8.8 శాతం.
* తయారీ, నిర్మాణం కీలకంగా ఉన్న ద్వితీయరంగాల్లో 2020-21లో వృద్ధిరేటు 0.3 శాతం తగ్గగా ఈసారి 21.5 శాతం పెరిగింది. అనుబంధ రంగాల్లో గత ఏడాది 0.9 శాతం వృద్ధిరేటు ఉండగా ఈసారి 18.3 శాతం నమోదైంది.
* తయారీ రంగంలో గత అభివృద్ధి ఐదేళ్లలోనే అత్యధికంగా 28.8 శాతంగా ఉంది.
* నిర్మాణ రంగంలో వృద్ధి అంతకుముందు కంటే 8.4 శాతం పెరిగింది.
* వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల రంగం సాధారణ స్థితికి చేరుకుంది.

సాధారణ స్థితికి చేరని రవాణారంగం

రాష్ట్రంలో అన్ని రకాల రవాణాలు గత ఏడాది కంటే కోలుకున్నా పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. రైల్వే రవాణాలో కొవిడ్‌ వల్ల 2020-21లో 6.6%, రోడ్డు రవాణాలో 3.1%, విమాన రవాణాలో ఏకంగా 21.3% వృద్ధిరేటు తగ్గింది. కొవిడ్‌ కంటే ముందు 2019-20లో రైల్వేల వృద్ధిరేటు 27.3% ఉండగా ప్రస్తుత ఏడాది 10.3%గా అంచనా వేశారు. రోడ్డు రవాణా 5.4%, విమాన రవాణా 13.3%గా ఉంది.

స్థిరాస్తిలో కొనసాగుతున్న జోరు

కరోనా ప్రభావంతో గత ఏడాది స్థిరాస్తి(రియల్‌ ఎస్టేట్‌), సొంతిళ్ల రంగంలో 2.2 శాతం వృద్ధిరేటు మాత్రం నమోదైనా ఈ సారి 14.4శాతం వృద్ధిరేటు అంచనా వేశారు. ఈ రంగంలో గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వృద్ధిరేటు కావడం గమనార్హం.

రంగాల వారీగా

ఇదీ చదవండి: వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.