ETV Bharat / city

KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ - తెలంగాణ వార్తలు

Telangana Govt Letter To Krishna Board
Telangana Govt Letter To Krishna Board
author img

By

Published : Jul 20, 2021, 8:42 PM IST

Updated : Jul 21, 2021, 4:39 AM IST

20:39 July 20

కృష్ణా జలాలు 50:50 నిష్పత్తిలో పంచాలని కోరిన తెలంగాణ

కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-2 ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే వరకు 2021-22 నీటి సంవత్సరం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు 50ః50 నిష్పత్తిలో తాత్కాలిక పద్ధతిలో నీటిని కేటాయించాలని తెలంగాణ కోరింది. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు.

లేఖలోని ముఖ్యాంశాలు

* 'ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, ఉమ్మడి ప్రాజెక్టులకు నిర్వహణ మార్గదర్శకాలు లేనందున అడ్‌హాక్‌ పద్ధతిలో ఏ ఏడాదికి ఆ ఏడాది నీటివినియోగానికి కేటాయింపులు జరుగుతున్నాయి.

* 12వ బోర్డు సమావేశంలో 2020-21వ సంవత్సరానికి చిన్ననీటి వనరులు, గోదావరి నుంచి మళ్లించే నీటిని మినహాయించి తెలంగాణ 34 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 66 శాతం వినియోగించుకొనేలా అంగీకారం కుదిరింది.

* పరీవాహక ప్రాంతం, జనాభా, కరవు ప్రాంతం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే తెలంగాణకు 70.8, ఏపీకి 29.2శాతం నీటి వాటా రావాల్సి ఉంది.

* 1976లో మొదటి ట్రైబ్యునల్‌, 2013లో రెండో ట్రైబ్యునల్‌ కూడా పక్క బేసిన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి.

* విచారణలో ఉన్న కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-2 ముందు తెలంగాణ 771 టీఎంసీలు తమ అవసరంగా పేర్కొంది.

* ఆమోదం పొందని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 4.7 టీఎంసీలను మళ్లించడంతో పాటు పెన్నా బేసిన్‌లో 300 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం ఉంది. అదే తెలంగాణకు రోజుకు 0.28 టీఎంసీ, అదీ ఎత్తిపోతల ద్వారానే ఆ అవకాశం లభిస్తుంది.

* పక్క బేసిన్‌లకు నీటి మళ్లింపుపై కృష్ణాబోర్డుకు, జల్‌శక్తి మంత్రిత్వశాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం విచారణలో ఉన్న ట్రైబ్యునల్‌ తుది తీర్పు వచ్చే వరకు, 2021-22వ సంవత్సరంలో 50 శాతం చొప్పున నీటిని కేటాయించాలని కోరుతున్నాం.

ఇదీ చదవండి

Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

Last Updated : Jul 21, 2021, 4:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.