ETV Bharat / city

తెలంగాణ: గాంధీలో కోలుకున్న కరోనా బాధితుడు

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు కోలుకుంటున్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్సపొందుతున్న బాధితుడి నమూనా రిపోర్టులో నెగిటివ్‌ వచ్చింది. యువకుడికి క్రమంగా జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.

no carona in telangana
రాష్ట్రంలో కరోనా లేదు: తెలంగాణ ప్రభుత్వం
author img

By

Published : Mar 9, 2020, 11:12 PM IST

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడిగా నమోదై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం 32 మంది ఇన్​పేషెంట్లుగా ఉన్నారని, వారిలో నెగిటివ్ రిపోర్టులు వచ్చిన వారందరినీ పంపిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కరోనా అనుమానితుడి నుంచి తాజాగా నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. వైద్యబృందం ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం అందించడం వల్ల క్రమంగా జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చింది.

తాజాగా ఊపిరితిత్తులకు సంబంధించిన నమూనాలు మళ్లీ సేకరించి పరీక్షలు పంపించారు. అందులోనూ నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీనిపై ఆసుపత్రివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి నమూనాలను సేకరించి పుణే వైరాలజీ ల్యాబ్​కు పంపించాలని నిర్ణయించారు. అక్కడ కూడా నెగిటివ్ వస్తే.. అతన్ని డిశ్చార్జ్ చేస్తారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.