ETV Bharat / city

TS Govt Letter to KRMB: 'శ్రీశైలం నుంచి ఏపీ కేవలం 34 టీఎంసీలు మాత్రమే తరలించాలి' - Krishna River Management Board news

TS Govt Letter to KRMB
TS Govt Letter to KRMB
author img

By

Published : Oct 26, 2021, 3:38 PM IST

Updated : Oct 26, 2021, 4:41 PM IST

15:19 October 26

కే‌ఆర్‌ఎం‌బీ ఛైర్మన్‌కు రెండు లేఖలు రాసిన తెలంగాణ ఈఎన్‌సీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ రెండు లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో నందికొండ ప్రాజెక్టు నివేదికలు బేఖాతరు చేస్తూ.. నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఇష్టా రీతిన పెంచుకుంటూ పోయారని మురళీధర్‌ లేఖలో ప్రస్తావించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలోని కట్లేరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారని వివరించారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు లక్షా 3 వేల ఎకరాలు మాత్రమేనని ఈఎన్సీ గుర్తు చేశారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేదికకు భిన్నంగా వ్యవహరించిందన్నారు.  

గత ప్రభుత్వాలు రిపోర్టును ఖాతరు చేయలేదు

ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఎకరాలకు పెంచిందన్నారు. తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు తగ్గించిందని కేఆర్​ఎంబీ ఛైర్మన్‌కు రాసిన లేఖలో ఈఎన్సీ మురళీధర్‌ గుర్తుచేశారు. లక్ష ఎకరాలను లిఫ్ట్ పథకాల ద్వారా సాగులోకి తీసుకు రావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. 53 వేల ఎకరాల ఆయకట్టును చిన్న చెరువుల కింద స్థిరీకరించాల్సి ఉందని.. ఈ అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పాలేరు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులేటర్ గేట్ కనీస మట్టాన్ని 13 మీటర్లు తగ్గించినందువల్ల తెలంగాణలో చాలా ఆయకట్టును కోల్పోయిందని లేఖలో పేర్కొన్నారు.  

ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదు

1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉమ్మడి నివేదికకు అనుగుణంగా ఆంధ్ర ప్రాంతంలో ఆయకట్టును 1.3 లక్షల ఏకరాలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు 1954 ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లేరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని.. జులై 15 గెజిట్ నోటిఫికేషన్‌లో షెడ్యూల్ 2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలని కోరారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు తెలియజేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..ప్రభుత్వ ఉత్తర్వులు

Last Updated : Oct 26, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.