DH Srinivas on Night Curfew in Telangana : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత కరోనా తీవ్రత లేదని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు వివరించారు. కొవిడ్ పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ నేపథ్యంలో నివేదిక సమర్పించారు. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని డీహెచ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని వెల్లడించారు. ఒక్క జిల్లాలోనూ 10 శాతం మించలేదని వివరించారు.
DH Srinivas on Corona Cases in Telangana ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందన్న వైద్యరోగ్య శాఖ.. ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని.. మూడ్రోజుల్లోనే లక్షణాలున్న లక్షా 78 వేలమందికి కిట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. 18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి టీకాలు ఇచ్చామని డీహెచ్ వివరించారు. రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పూర్తైందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- పెరిగిన మరణాలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!