ETV Bharat / city

Jaggareddy: నేను సమైక్యవాదినే.. కేసీఆర్ అలా వస్తే మద్దతిస్తా: జగ్గారెడ్డి - jagga reddy sensational comments about united andhra pradesh

కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు(jagga reddy sensational comments about united andhra pradesh news). కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే.. తానూ మద్దతిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనూ సమైక్యవాదాన్నే వినిపించినట్టు గుర్తు చేశారు. సమైక్యం.. తన వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

telangana congress leader jagga reddy
telangana congress leader jagga reddy
author img

By

Published : Oct 30, 2021, 5:51 PM IST

సమైక్యవాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొస్తే.. తాను కూడా మద్దతిస్తానంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు(jagga reddy sensational comments about united andhra pradesh news). ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఉద్యమ సమయంలో కూడా.. సమైక్య వాదం వైపే ఉన్నట్టు గుర్తు చేశారు. తనను తెలంగాణ ద్రోహి అన్నా.. ఎమ్మెల్యేగా గెలిచినట్టు పేర్కొన్నారు. ఆ రోజు తనను తప్పుబట్టిన నాయకులే.. ఇప్పుడు ఒక్కొక్కరుగా వారి ఆభిప్రాయాన్ని మార్చుకుని సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని వివరించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్న జగ్గారెడ్డి.. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని.. ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటానని తెలిపారు.

తప్పుబట్టిన వాళ్లే మద్దతిస్తున్నారు..
"అక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్​ సమైక్యవాదంతో ముందుకొస్తే.. నేను మద్దతు ఇస్తా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే... పార్టీకి సంబంధం లేదు. నేను ఉద్యమ సమయంలో కూడా సమైఖ్య వాదాన్నే వినిపించాను. అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు... అయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ రోజు నన్ను తప్పుబట్టిన వారు... ఇప్పుడు సమైఖ్యానికి మద్దతు పలుకుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో... పార్టీ పెట్టమని కోరుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దానికి.. పార్టీ పెట్టడం ఎందుకు....రాష్ట్రాన్నే కలిపేద్దాం అని ఆంధ్ర మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారు. ఇది ప్రజల డిమాండ్ కాదు... నాయకుల అభిప్రాయమే. నేను ప్రజల ఆలోచన మేరకే వెళ్తాను. ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదు. ఆంధ్ర , తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల ప్రజలు నాకు ఒకటే." - జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

రేవంత్​ అభిప్రాయం వేరు..
ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడామని జగ్గారెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్టం కోసం కొట్లాడినట్టు గుర్తుచేశారు. విభజన జరిగినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కోటి మందికి పైగా ఇక్కడ ఉన్నట్టు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి అభిప్రాయం వేరని.. వ్యక్తిగతంగా తన అభిప్రాయం వేరని స్పష్టం చేశారు. సమైక్యం విషయంలో.. తాను ఎవ్వరి అభిప్రాయాలను తప్పు పట్టనన్న జగ్గారెడ్డి.. ఎవ్వరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు.

సంబంధిత కథనాలు..

భారత్​ X న్యూజిలాండ్: గెలిచిన జట్టుకే సెమీస్​ ఛాన్స్​!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.