రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలులో ఆలస్యం అవుతోందని ఆరోపించారు. రైతులకు సంఘీభావంగా బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఎవరి ఇంట్లో వారు ఉపవాస దీక్ష చేస్తున్నారు.
ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదు. దళారీ వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. క్షేత్రస్థాయిలో మంత్రులు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. రైతుల ఇబ్బందులు గమనించినా ఆదుకోలేని పరిస్థితి. లాక్‌డౌన్ నిబంధనల మేరకు నిరసన తెలిపిన రైతులపై కేసులు పెడుతున్నారు. సిరిసిల్లలో రైతులు ధాన్యాన్ని తగులబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అన్నదాతలకు భరోసాగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉపవాస దీక్ష చేస్తున్నాం.
-బండి సంజయ్, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: బెటాడిన్ ద్రావణంతో కరోనా ముప్పుకు చెక్!