ప్రజాహిత పాలన అని ప్రకటించి ప్రజాభక్షక పాలనకు నాంది పలికారంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ధరల స్థిరీకరణ నిధి కోసం 3వేల కోట్ల రూపాయలు అంటూనే.. సామాన్యులపై ధరల భారం మోపారని ఆమె ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు ధరల పెరుగుదలకు కారణం ఎవరని నిలదీశారు. ప్రజలపై భారం వేసి.. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా బ్లాక్ మార్కెట్ నడుస్తోందన్న అనిత.. కృత్రిమ కొరతను సృష్టించి సామాన్యులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ధరల స్థిరీకరణ అన్న ప్రభుత్వానికి పెరిగిన నిత్యావసరాలు, కూరగాయలు ధరలు కనిపించడం లేదా అని నిలదీశారు. అసలు ధరలు స్థిరీకరించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అంటూ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్, ఆర్టీసీ ధరల్ని పెంచడం మోసం కాదా అని ప్రశ్నించారు. ఆదాయం లేక అవస్థలు పడుతుంటే.. ధరల పెంపు నమ్మకద్రోహం కాదా అని నిలదీశారు. రవాణా రంగంపై వేసిన భారం సామాన్యుడి నెత్తిన పిడుగైందన్నారు. ధరల నియంత్రణకు వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ వస్తు నిల్వలను అడ్డుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న బ్లాక్ మార్కెట్‌ను నిలువరించాలని అనిత డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్